Hindupur YSRCP :   హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను ఢీ కొట్టడానికి వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కొత్తగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్సతోంది. రెండు రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ ల సమీక్షా సమావేశానికి.. ఎమ్మెల్సీ, ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్ కు ఆహ్వానం ఇవ్వలేదు. దీపిక అనే కొత్త నేతను పిలిచారు. దీంతో అనంతపురం జిల్లా వైఎస్ఆర్‌సీపీలో కలకలం బయలుదేరింది. ఎందుకంటే చాలా మందికి ఈ దిపిక ఎవరో తెలియదు.


పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి ఆశీస్సులు - పెనుకొండ నాయకుని బంధువు                        


ఆంధ్రప్రదేశ్‌లో హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో  హిందూపురం ఒకటి.  టీడీపీ ఆవిర్భవించిన తర్వాత మరో పార్టీ అక్కడ గెలవలేదు . అందుకే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తూంటారు. ప్రస్తుతం బాలకృష్ణ అక్కడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.  బాలకృష్ణను ఢీ కొట్టాలంటే ఎలాంటి ఇమేజ్ లేని నేత అవసరం అని ... ఐ ప్యాక్ డిసైడ్ చేయడంతో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీపికను ఎంపిక చేశారని అంటున్నారు.  పెద్దిరెడ్డిగా అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన  పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ద్వారా ఎమ్మెల్సీకి చెక్‌పెట్టి, దీపికను తెరపైకి తీసుకొచ్చారని ంటున్నారు.  రేపో.. మాపో.. నియోజకవర్గ ఇన్‌చార్జిగా దీపికను ప్రకటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే సమీక్షకు ఆహ్వానించారని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. 
 
అంతర్గత వివాదాలతో హైకమాండ్‌కు  హిందూపురం తలనొప్పి 
 
ఎందుకంటే హిందూపురం వైసీపీలో చాలా గ్రూపులున్నాయి. కాంగ్రెస్ తరపున.. తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోనే ఉన్నారు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో  గత ఎన్నికల్లో హిందూపురం నుంచి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ పోటీ చేశారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతో ఆయనే హిందూపురంలో పెత్తనం చేస్తున్నారు. అయితే ఆయనను బలంగా వ్యతిరేకించే వర్గం  అక్కడ ఉంది.   ఓ వర్గానికి చెందిన చౌళూరు రామకృష్ణారెడ్డి అనే నేత హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ఇక్బాల్ పేరే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే చర్యలు తీసుకోలేదు కానీ..ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 
  
ఇంతకీ ఈ దీపిక ఎవరు ?                          


రాజకీయాల్లో అసలు ఎవరికీ తెలియని  నేతను తీసుకొచ్చి.. నిలబటెట్డం అంటే సాహసం అనుకోవాలి. అదీ కూడా బాలకృష్ణ లాంటి మాస్ లీడర్ పై  కొత్త నేతను దింపితే.. అందరి సహకారంతో పని చేస్తేనే పోటీ ఇవవగలుగుతారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా అసంతృప్తికి  గురవుతారు. పాతవారు కూడా వ్యతిరేకరిస్తారని .. ఇది బాలకృష్ణకు మేలు చేస్తుందని అంటున్నారు. 




Join Us on Telegram: https://t.me/abpdesamofficial