యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయ విచారణ


తెలంగాణలో (Telangana) విద్యుత్ రంగానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాదాద్రి ప్రాజెక్టుతో (Yadadri Project) పాటు ఛత్తీస్ గఢ్ (Chattishgarh) తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైనా సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. విద్యుత్ రంగంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య శాసనసభలో వాడీ వేడీ చర్చ సందర్భంగా, తనపై వస్తోన్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభాపతిని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్, జగదీష్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇంకా చదవండి


వాలంటీర్లకు గుడ్ న్యూస్


ఏపీలో గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వారికి రూ.750 జీతం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం లభిస్తోంది. ఇంకా చదవండి


ట్యాబులతో ప్రతి విద్యార్థికి రూ. 33వేల లబ్ది


విద్యార్థులకు ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ధి కలుగుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లిలో తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  నాడు- నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చామన్నారు.  10 రోజుల పాటు విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు.  పేదరికం సంకెళ్లు తెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని..   విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చూట్టామని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తూంటే.. వద్దంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు.  పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నానన్నారు.  పేద పిల్లలకు మంచి చేస్తుంటే ఏడుస్తున్నారని ఆరోపించారు. ఇంకా చదవండి


విద్యుత్ రంగాన్ని నష్టాలపాల్జేసింది బీఆర్ఎస్‌- శ్వేతపత్రంలో ఎంత అప్పులు చూపించారంటే?


తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ(Telangana Assembly Sessions ) సమావేశాలే చాలా హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ శాఖల్లో విధ్వంసంపై బుధవారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఆర్థిక స్థితిగతులపై వైట్‌పేపర్‌ రిలీజ్ చేసింది. గురువారం నాడు విద్యుత్‌ శాఖలో ఉన్న పరిస్థితిని సభ ముందు ఉంచింది. ఇంకా చదవండి


'రాష్ట్రంలో కరోనా కేసులు లేవు' - పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్న వైద్య ఆరోగ్య శాఖ


పొరుగు రాష్ట్రం తెలంగాణలో (Telangana) కరోనా కొత్త వేరియంట్ (Corona New variant JN1) కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. అయితే, ఏపీలో (Andhrapradesh) ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు (Krishnababu) అన్నారు. అయితే, కేరళ (Kerala) వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అన్నింటికీ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఇప్పటికే అందజేశామని, అక్కడ ఏదైనా పాజిటివ్ నిర్ధారణ అయితే, దానిని ఆర్టీపీసీఆర్ టెస్టుకు పంపేందుకు వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచామన్నారు. అక్కడ కూడా పాజిటివ్ అని తేలితే విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇంకా చదవండి