CM Jagan Tabs Distribution : విద్యార్థులకు ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ధి కలుగుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లిలో తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాడు- నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చామన్నారు. 10 రోజుల పాటు విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు. పేదరికం సంకెళ్లు తెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చూట్టామని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తూంటే.. వద్దంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నానన్నారు. పేద పిల్లలకు మంచి చేస్తుంటే ఏడుస్తున్నారని ఆరోపించారు.
జగన్ దుబారాగా ఖర్చు పెడుతున్నారని అంటున్నారు.. ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి భవిష్యత్ కోసమేనన్నారు. మంచి చేస్తున్న నాపై ఎలాంటి బురద వేస్తున్నారో చూస్తున్నాం.. చంద్రబాబు, దత్తపుత్రుడు దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ట్యాబులు ఇస్తే చెడిపోతున్నారట.. ఏవేవో వీడియోలు చూస్తున్నారట, గేమ్స్ ఆడుతున్నారట.. నాపై పని గట్టుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే.. మన పిల్లలు దేశంలోనే అత్యత్తమంగా ఉండాలి.. గత పాలనలో స్కూళ్లు ఎలా ఎన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయి.. అని ప్రశ్నించారు. తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్ తో ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు.
తనపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై మండిపడ్డారు. గత ప్రభుత్వం కన్నా అప్పులు తక్కువే చేశానని.. కానీ పది లక్షల కోట్లు అప్పులు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతలతో పాటు మీడియాపైనా విమర్శలు గుప్పించారు. రెండున్నర లక్షల కోట్లు అక్క, చెల్లెమ్మల ఖాతాలో వేశానని చెప్పుకొచ్చారు. ఇవన్నీగత ప్రభుత్వం ఎందుకు చేయలేదన్నారు. తన మేనిఫెస్టోలో 99.5 శాతం పథకాలు అమలు చేశానని ప్రకటించారు. టీడీపీ నేతలు బోలెడన్ని హామీైలు ఇస్తారని.. ణలు చేయరన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు.. నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు.. ఇసుక నుంచి మద్యం వరకు అన్నీ స్కాములే.. రాబోయే రోజుల్లో ఇంకా బురద చల్లుతారు.. మంచి చేసే నాపై ఎలాంటి బురద చల్లుతున్నారో చూస్తున్నాం.. రాబోయే రోజుల్లో ఇంకా బురద చల్లుతారని వాటిని నమ్మవద్దని కోరారు. సీఎం జగన్ తన ప్రసంగంలో ప్రతి పదానికి ముందు మీ బిడ్డ మీ బిడ్డ అని ప్రసంగిస్తున్నారు. పిల్లల ట్యాబ్‌ల పంపిణీ కార్యాక్రమం కావడంతో స్కూళ్ల నుంచి విద్యార్థుల్ని తీసుకు వచ్చారు. వారి ఎదురుగా మీ బిడ్డ మీ బిడ్డ అని రాజకీయ ప్రసంగాలు చేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.