అసెంబ్లీలో ఓడిన బీజేపీ సీనియర్లు పార్లమెంట్‌పై గురి
తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అసెంబ్లీకి ( Assembly Elections ) పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ( Parlament Elections ) గెలవాలని అనుకుంటున్నారు అందు కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిపోయారు. అయితే ఈటలకు ( Eatala ) మాత్రమే నియోజకవర్గ సమస్య ఏర్పడుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఇంకా చదవండి
అది గవర్నర్ ప్రసంగం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో - బీఆర్ఎస్
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. అది గవర్నర్ ప్రసంగంలా లేదని కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుగా ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శఇంచారు. గవర్నర్ ప్రసంగం లో కొత్త ధనం లేదు , అభివృద్ధి కి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ని విస్మరించారని తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు ,కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని.. ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ నెంబర్ వన్ ,ఐటీ ఎగుమతుల్లోసాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదు ..ఆమె స్థాయి కి తగదన్నారు. ఇంకా చదవండి
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం పించన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆరోగ్య శ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇంకా చదవండి
ఉండి సమీపంలో రోడ్డు ప్రమాదం - పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం !
ఆంధ్రప్రదేశ్ లోని ఉండి సమీపంలో జరిగిన రోడ్ ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ప.గో జిల్లా ఉండి వద్ద ఓ కారును మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. షేక్ సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున 2021లో విజయం సాధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఏలూరులో అంగన్ వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి భీమవారం వెళ్తుండగా .. ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు. ఇంకా చదవండి
భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య
సిద్ధిపేట (Siddipet) జిల్లా చిన్నకోడూరు (Chinnakoduru) మండలం రామునిపట్లలో (Ramunipatla) శుక్రవారం దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కలెక్టర్ గన్ మెన్ అనంతరం గన్ తో తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ (Jeevanpatil) వద్ద గన్ మెన్ గా పని చేస్తున్న ఆకుల నరేష్ (Akula Naresh), తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీతో కలిసి చిన్నకోడూర్ లోని రామునిపట్లలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం నరేశ్ విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. ఇంకా చదవండి