Pension Increase in AP: ఏపీ ప్రభుత్వం (AP Government) పించన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజిక పెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు చేయనున్నట్లు పేర్కొంది. 'మిగ్ జాం' తుపాను నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు
- విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదం, అలాగే విశాఖలోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం
- జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం
- 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం, అలాగే ఈ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలల్లో అంకాలజీ (క్యాన్సర్ చికిత్స, అధ్యయనం) విభాగం ఏర్పాటుకు నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ.300 ఇవ్వాలని నిర్ణయం.
- ఏపీ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
- రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు, ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ, వీటిపై విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం
- కోర్టుల్లో పని చేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ఏ చెల్లింపు
- యాంటీ నక్సల్ ఆపరేషన్ లో పని చేసే టీమ్స్ కు 15 శాతం అలవెన్స్ పెంపు, కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
- ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యూబ్స్ పంపిణీ
- ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం
- ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం
- 45 - 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం.
Also Read: Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు లేవు - తేల్చేసిన కిషన్ రెడ్డి !