Telangana BJP Senior leaders :  తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అసెంబ్లీకి  ( Assembly Elections ) పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ( Parlament Elections ) గెలవాలని అనుకుంటున్నారు అందు కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిపోయారు. అయితే ఈటలకు ( Eatala ) మాత్రమే నియోజకవర్గ సమస్య ఏర్పడుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది తేల్చుకోలేకపోతున్నారు. 


పోటీ చేసిన సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి


తెలంగాణ బీజీపే నేతుల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్రభావం చూపించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బరిలోకి దిగారు కానీ పరాజయమే ఎదురయింది. బండి సంజయ్ కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక మరో ఎంపీ బాపూరావు దీ అదే పరిస్థితి. అంటే ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ముగ్గురూ ఓడిపోయారు. వీరితో పాటు సీనియర్లు ఇతరులు కూడా పార్లమెంట్ బరిలోకి దిగాలనుకుంటున్నారు. 


'ఇది ప్రజా ప్రభుత్వం.. మాది ప్రజల పాలన' - మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, రైతు రుణమాఫీపై అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రకటన


సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఖాయమే !                             


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సిట్టింగ్ ఎంపీలకు హైకమాండ్ టిక్కెట్లు కేటాయిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.  నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ స్థాయిలో ఎంపీ స్థానానికి పోటీపడే నాయకుడు లేకపోవడం ఆయనకు కలిసి వస్తుంది. బండి సంజయ్ కు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. పైగా ఆయన జాతీయ స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించే అవకాశం లేదు. అాలాగే ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు.. కూడా టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కిషన్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమే. 


భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య - సిద్ధిపేట జిల్లాలో దారుణం


ఈటల రాజేందర్ పోటీ ఎక్కడ నుంచి ?                         


మరో వైపు ఈటల రాజేందర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంత కాలం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న ఆయన బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ ఆయనకు సరైన స్థానం లేదు. కరీంనగర్ లో బండి సంజయ్ ఉంటారు. అందుకే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నాురు. ఆయనకు హైకమాండ్ చాన్స్ ఇస్తుందా లేదా.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని చెబుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు కానీల.. ఆయన మాత్రం పార్లమెంట్ కు పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు.