Governor speech Reactions : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. అది గవర్నర్ ప్రసంగంలా లేదని కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుగా ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శఇంచారు. గవర్నర్ ప్రసంగం లో కొత్త ధనం లేదు , అభివృద్ధి కి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ని విస్మరించారని తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు ,కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని.. ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ నెంబర్ వన్ ,ఐటీ ఎగుమతుల్లోసాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదు ..ఆమె స్థాయి కి తగదన్నారు.
గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం .. లంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని గుర్తు చేశారు. 2014 లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తం అయ్యింది ..ఇపుడు కావడమేమిటో నని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదన్నారు. దళిత బంధు ప్రస్తావన లేదు. రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడ లేదు. కాంగ్రెస్ హామీల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో ఆర్థిక విధ్వంసం గురించి చెప్పారని..కానీ ఆర్థిక విద్వంసం కాదు .. ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
అప్పుల పేరుతో పథకాల నుండి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మరో ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. . గవర్నర్ ప్రసంగమా ? ఎన్నికల ముందు కాంగ్రెస్ మాట్లాడిన ప్రచార మాటలా ? కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా? అని ప్రశ్నించారు. మొత్తం గవర్నర్ ప్రసంగం లో తెలంగాణ ఈ పది సంవత్సరాల లో తిరోగమనం లో ఉంది అన్నట్లు చెప్పారు. అదే నిజమైతే మరి కేంద్ర ప్రభుత్వ నివేదికలు, RBI, NITI Aayog report, UNO మరియు ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు ఇచ్చిన ఆవార్డులు, గుర్తింపులు దాచేస్తే దాగని సత్యాలుగా ?
తెలంగాణలో పండుతున్న పంటలు సత్యం, వస్తున్న కరంటు సత్యం, పారుతున్న నీళ్లు సత్యం, పెరిగిన తలసరి ఆదాయం సత్యం, జరిగిన హైదరాబాద్ అభివృద్ధి సత్యం, గ్రామాలలో స్వచ్ఛత సత్యం, పట్టణాల సుందరీకరణ సత్యం, SOTR లో తెలంగాణ దేశానికి తలమానికంగా ఉన్నది అన్నది సత్యం, IT, industry అభివృద్ధి సత్యమన్నారు. అబద్ధాలు చెప్పడం వలన అభాసు పాలు కావడం తప్ప ఏమీ ఉండదని.. తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద బురద చల్లే కంటే 6 గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ వహిస్తే మంచిదని సూచించారు.
విద్యుత్ శాఖలో రూ.86 వేల కోట్ల అప్పులను చూపడం హస్యాస్పమన్నారు. పదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.42 వేల కోట్లు, రూ.26 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్, 6 నుండి 25 కు పెరిగిన 400 కేవీ సబ్ స్టేషన్లు, 51 నుండి 103కు పెరిగిన 220 కేవీ సబ్ స్టేషన్లు, 176 నుండి 250కి పెరిగిన 132 కేవీ సబ్ స్టేషన్లు, 2138 నుండి 3250కి పెరిగిన 33/11 కేవీ సబ్ స్టేషన్లు దాచేస్తే దాగని సత్యాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ స్థాపిత సామర్ద్యం 2023 మే నాటికి 18,567 మెగావాట్లకు పెంచుకున్న విషయం నిజం కాదా ? రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి అత్యంత తక్కువగా రుణాలు తీసుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా ? కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బాగు చేయకున్నా నష్టం చేయకుంటే చాలన్నారు.