కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గుడ్‌ బై


పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు జనగామ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన, రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరనున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇంకా చదవండి


అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట


అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ప్రమేయంతోనే ఘర్షణలు జరిగాయన్న కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు పెట్టిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని పోలీసులు కేసు పెట్టారు. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం వాదనలు ముగిశాయి. రిజర్వ్ చేసిన తీర్పును ఈ ఇవాళ వెల్లడించింది న్యాయస్థానం. బెయిల్‌ షరుతుల్లో భాగంగా రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఇంకా చదవండి


అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలు నియామకం


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలాఖరులో జరగనున్నందున బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ప్రచారం విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించింది. ప్రస్తుతానికి 54 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. కొత్తగా నియమితులు అయిన వీరందరితో మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌రావు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించారు. బీఆర్ఎస్ విజ‌యానికి అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌, వ్యూహాలపై కేటీఆర్, హ‌రీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. ఇంకా చదవండి


పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు బాధ కలిగించాయి-బండ్ల గణేష్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై పలువురు స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తప్పుపట్టారు. నిన్నటి నుంచి మనసులో వేదన కలిస్తోందన్న ఆయన, బాధ కలిగిస్తోందన్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే తన బతుకు ఎందుకని, చిరాకు కలిగిస్తోందన్నారు. తనకు ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని అన్నారు. మీరు పెద్ద హోదాలో ఉన్నారని, భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడని గుర్తు చేశారు. ఇంకా చదవండి


పలాస వైసీపీలో తారాస్థాయికి విభేదాలు- టీడీపీ వైపు మంత్రి సీదిరి ప్రత్యర్థులు చూపు


శ్రీకాకుళం జిల్లాలోని పలాస రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ వాతావరణం అక్కడ ఉంది. అధికారం అండతో రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు దూకుడుగా వ్యహరిస్తుండగా ప్రజాసమస్యలే అజెండాగా టీడీపీ ఇన్‌ఛార్జి గౌతు శిరీష అదే స్థాయిలో దూసుకువెళ్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పలాస పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా చదవండి