ఏపీలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది నిర్వహించే నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఏపీ నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ సంఖ్యను మరింత పెంచేలా, ఎక్కువ మందిని ప్రోత్సాహించేలా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అక్టోబరు 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


ఈ పథకం ద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా లభించనుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత పొందినవారికి వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనుంది. డీబీటీ పద్ధతిలో నేరుగా అభ్యర్థుల ఖాతాల్లోనే నగదు జమ చేయనుంది. 


ఎన్నిసార్లు అయినా సాయం..
ఈ పథకం కింద అభ్యర్థులు యూపీఎస్‌సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం పొందే వీలుంది. ఈ ప్రోత్సాహకంతో ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందేలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఈ సాయం అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతోంది.  


పథకానికి ఎవరు అర్హులు?


♦ సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుక­బడిన వర్గాలకు చెందినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 


♦  ఆంధ్రప్రదేశ్‌లో స్థానికుడై ఉండాలి. 


♦ తప్పనిసరిగా యూపీ­ఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. 


♦ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు  కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్‌ ద్వారా ధృవీకరిస్తారు.


♦ కుటుంబానికి 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు.


ALSO READ:


భారత నౌకాదళంలో 224 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా
భారత నౌకాదళం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ) జూన్ 2024లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు, కేడర్‌, స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది. సరైన అర్హతలు గల అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..