అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ప్రమేయంతోనే ఘర్షణలు జరిగాయన్న కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు పెట్టిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని పోలీసులు కేసు పెట్టారు. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం వాదనలు ముగిశాయి. రిజర్వ్ చేసిన తీర్పును ఈ ఇవాళ వెల్లడించింది న్యాయస్థానం. బెయిల్ షరుతుల్లో భాగంగా రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
సీడీఆర్ పిటిషన్‌పై విచారణ 18కి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను అరెస్టు చేసిన సందర్భంగా సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారు... ఎవరి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయనే విషయంపై క్లారిటీ కోసం వారి కాల్ డేటాను భద్ర పరచాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి 18కి వాయిదా వేశారు.