గ్రూప్2 వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్- టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన
గ్రూప్ 2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. వరుసగా వస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే టైం లేదని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆగస్టు 29, 30న జరిగే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఇంకా చదవండి
చల్లబడిన కోడెల శివరాం
సత్తెనపల్లి తెలుగు దేశం రాజకీయం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. కన్నా లక్ష్మినారాయణకు బాధ్యతలు అప్పగించటాన్ని వ్యతిరేకించిన కొడెల శివరాం లోకేష్ సమక్షంలో కన్నా తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గానికి చేరింది. పాదయాత్రలోనే పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న గొడవలు వర్గపోరు వంటి అంశాలను లోకేష్ సర్దుబాటు చేస్తున్నారు. అందులో భాగంగానే సత్తెనపల్లిలో కూడా కన్నా, శివరాం మధ్య సయోధ్య కుదిర్చారు. ఇంకా చదవండి
విశాఖలో జనసేన అధినేత- కాసేపట్లో వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టే మూడో విడత వారాహి విజయయాత్ర విశాఖలో ప్రారంభంకానుంది. పది రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ యాత్రంలో సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. ఇంకా చదవండి
ఎల్ అండ్ టీకే విమానాశ్రయ మెట్రో - వచ్చే నెలలోనే పనులు ప్రారంభం
విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్ ఎల్ అండ్ టీ సంస్థకే చేజిక్కినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశకు గ్లోబర్ టెండర్లు పిలిచారు. అయితే రెండు బిడ్లు మాత్రమే దాఖలు అయ్యాయి. ఎల్ అండ్ టీ టిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్ మాత్రమే పోటీ పడ్డాయి. గత నెల రోజులుగా మెట్రో అధికారులు, జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కలిసి.. ప్రాజెక్టు అమలులో ఆ రెండు కంపెనీల అనుభనం, సాంకేతిక, ఆర్తిక నివేదికలు, పత్రాలను అధ్యయనం చేశారు. మెట్రో నింబధనల్లో తొలిసారిగా పొందు పరిచిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ లో అనుభవనం, అర్హత ఉన్న ఎల్ అండ్ టీకే టెండర్ ఖరారు అయినట్లు ఒక అధికారి తెలిపారు. టెండర్ అధ్యయన సమాచారం, మెట్రో అధికారులు సిఫార్సులను నివేదించిన అనంతరం ప్రభుత్వ అనుమతితో త్వరలో ఈ విషయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
అనుచరులతో వంగవీటి రాధా చర్చలు - రాజకీయ పయనంపై తుది నిర్ణయం తీసుకునే చాన్స్!
విజయవాడ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా పేరున్న వంగవీటి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వంగవీటి మోహన రంగా వారసుడిగా, కాపు సామాజిక వర్గంతో పాటుగా ఇతర కులాల్లో కూడా వంగవీటి రాధాకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ మెదలు కావటంతో ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయాలు పై అందరిని ఆకర్షిస్తుంది. ఇంకా చదవండి