Airport Metro: విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్ ఎల్ అండ్ టీ సంస్థకే చేజిక్కినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశకు గ్లోబర్ టెండర్లు పిలిచారు. అయితే రెండు బిడ్లు మాత్రమే దాఖలు అయ్యాయి. ఎల్ అండ్ టీ టిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్ మాత్రమే పోటీ పడ్డాయి. గత నెల రోజులుగా మెట్రో అధికారులు, జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కలిసి.. ప్రాజెక్టు అమలులో ఆ రెండు కంపెనీల అనుభనం, సాంకేతిక, ఆర్తిక నివేదికలు, పత్రాలను అధ్యయనం చేశారు. మెట్రో నింబధనల్లో తొలిసారిగా పొందు పరిచిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ లో అనుభవనం, అర్హత ఉన్న ఎల్ అండ్ టీకే టెండర్ ఖరారు అయినట్లు ఒక అధికారి తెలిపారు. టెండర్ అధ్యయన సమాచారం, మెట్రో అధికారులు సిఫార్సులను నివేదించిన అనంతరం ప్రభుత్వ అనుమతితో త్వరలో ఈ విషయం ప్రకటించనున్నట్లు సమాచారం.
మెట్రో రెండో దశలో మొదటి ప్రాధాన్యంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మొత్తం 31 కిలో మీటర్ల నిర్మాణానికి ప్రభుత్వ గత ఏడాది ఆఖరులో శంకుస్థాపన చేసింది. ప్రాజెక్టు వ్యయం రూ.6,250 కోట్లుగా అంచనా వేసింది. పూర్తిగా రాష్ట్ర సర్కారు నిధులతో చేపట్టారని నిర్ణయించింది. ఈపీసీ కాంట్రాక్టర్ ను ఎంపిక చేయడానికి హైదరాబద్ ఎయిర్ పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ ఇటీవల గ్లోబల్ టెండర్లను పిలిచింది. జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ వ్యయం, ఆకస్మిక వ్యయం, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ వంటివి మినహాయించి రూ.5,688 కోట్లకు టెండర్ పిలిచింది. హైదరాబాద్ లో మొదటి దశను చేపట్టిన, దేశంలోని వేర్వేరు నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ, బెంగళూరులో విమానాశ్రయ మెట్రో పనులు చేస్తున్న ఎన్సీసీ పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఎల్ అండ్ టీ సంస్థ ప్రాజెక్టును దక్కించుకుంది.
అయితే శంషాబాద్ విమానాశ్రయ మెట్రోని ప్యాకేజీల వారీగా కాకుండా టెండర్ దక్కించుకున్న సంస్థే అన్నీ చూసుకునేలా ఈపీసీ పద్ధతిలో గ్లోబల్ టెండర్లు పిలిచారు. మెట్రో ప్రాజెక్టుల్లో ఈపీసీ టెండర్ పిలవడం ఇదే మొదటిది అని అధికారులు తెలిపారు. ఇందులో సివిల్ వర్క్స్ తో పాటు సిగ్నలింగ్, ఎలక్ట్రికల్, రోలింగ్ స్టాక్, స్టేషన్ ప్లానింగ్, ట్రాక్ పనులు, డిపోలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్, విద్యుత్ స్కాడా వ్యవస్థ ఏర్పాటును టెండర్ దక్కించుకున్న సంస్థే చేపట్టాల్సి ఉంది. మొదటి దశలో ఇవన్నీ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో చేపట్టింది. కాకపోతే అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టు. విమానాశ్రయ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టు. పీపీసీలో చేసిన అనుభవం ఇక్కడ ఎల్ అండ్ టీ సంస్తకు సానుకూలంగా మారింది. ఈ నెలలో టెండర్ ఖరారు చేసి.. ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థతో వచ్చే నెలలో మెట్రో పనులను ప్రారంభింపజేయాలని అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.
మొత్తం తొమ్మది స్టేషన్లు
హైదరాబాద్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలో మీటర్ల మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లు నిర్మించాలని హైదారాబ్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ భావిస్తోంది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభం కాగా ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్ రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్ పట్టణం, విమానాశ్రయంలో జారీయ రహదారికి కొద్ది దూరంలో, విమానాశ్రయం టెర్మినల్ లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే వంపులు లేని చోట్ల స్టేషన్లు నిర్మిస్తారు. సమస్యలు ఉంటే మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేలా స్టేషన్ల మార్కింగ్ ఉండనుంది. మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని ఖరారు చేస్తారు. అయితే భవిష్యత్తులో మరో నాలుగు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకునేలా అలైన్ మెంట్ ను డిజైన్ చేశారు. భవిష్యత్తులో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పాకూడలి, రాజేంద్రనగర్ మధ్యలో కిస్మత్ పూర్ లోనూ ఓ స్టేషన్ నిర్మిస్తారట. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఓ స్టేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనావాసాలు పెరిగితే మరో స్టేషన్ ను కూడా నిర్మించే యోచనలో హెచ్ఏఎంఎల్ ఉంది.