Congress MLA Candidates List: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ప్రజాసమస్యలను ప్రత్యర్థుల లోపాలను టచ్ చేస్తూనే గెలిచే దమ్మున్న వ్యక్తిని బరిలో నిలిపేందుకు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఇందులో బీఆర్‌ఎస్ ముందు ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల జాబితా సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసి ఆ లిస్ట్‌ను కేసీఆర్ బయట పెడతారని కూడా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. 

ప్రత్యర్థులకు కౌంటర్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వివిధ రకాల సర్వేలు, ఇతర మార్గాల్లో లీడర్ల బలాాబలాలు తెలుసుకొని నియోజకవర్గాల్లో అభ్యర్థిపై ఓ అంచనాకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. సమస్యలు లేని స్థానాల్లో లీడర్లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 60 నియోజక వర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా సిద్ధమైందని టాక్ నడుస్తోంది. నియోజక వర్గాల వారీగా పీసీసీ, ఏఐసీసీ బృందాలు సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేశాయని తెలుస్తోంది. సర్వేలతోపాటుగా సామాజిక, రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను వడపోశారట. సీనియర్ల సూచనలతో పెద్ద కసరత్తే చేసినట్టు చెప్పుకుంటున్నారు.

వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితా విడుదలకు వీలుగా కాంగ్రెస్‌ వడపోత ప్రక్రియ సాగుతుందట. గొడవలు లేని, పోటీలో ఒకరే ఉన్న 60కిపైగా నియోజక వర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సర్వేల ఆధారంగా కొందరు నాయకులకు క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచించిందట. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నియోజక వర్గాలతోపాటు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు చోట్ల బీసీ నాయకులను దించాలని పీసీసీ యోచిస్తోంది. 

అలా సమస్యల్లేని, జాబితా ఇదేనంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. 

  • నర్సంపేట - మాధవరెడ్డి
  • వరంగల్ పశ్చిమ - నాయిని రాజేందర్
  • వరంగల్ తూర్పు - కొండా సురేఖ
  • ములుగు - సీతక్క
  • భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ
  • నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
  • హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కోదాడ -  ఉత్తమ్ పద్మావతి
  • నాగార్జున సాగర్ - జైవీర్ రెడ్డి (జానారెడ్డి కుమారుడు)
  • దేవరకొండ - బాలు నాయక్
  • ఆలేరు - బీర్ల ఐలయ్య
  • వనపర్తి - చిన్నారెడ్డి
  • కొల్లాపూర్ - మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు
  • కల్వకుర్తి - మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి
  • అచ్చంపేట - వంశీకృష్ణ
  • షాద్ నగర్ - ఈర్లపల్లి శంకర్ 
  • గద్వాల్ - సరిత యాదవ్
  • అలంపూర్ - సంపత్ కుమార్
  • కొడంగల్- రేవంత్ రెడ్డి
  • సంగారెడ్డి - జగ్గారెడ్డి
  • ఆందోల్ - దామోదర రాజనర్సింహ
  • జహీరాబాద్ - గీతారెడ్డి
  • నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్
  • గజ్వేల్ - నర్సారెడ్డి
  • నిర్మల్ - శ్రీహరిరావు
  • మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు
  • బెల్లంపల్లి -  గడ్డం వినోద్ కుమార్
  •  బాన్సువాడ - బాలరాజ్
  • జుక్కల్ - గంగారం
  • నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్ గౌడ్
  • కామారెడ్డి -  షబ్బీర్ అలీ
  • బాల్కొండ - ఆరంజ్ సునీల్ రెడ్డి
  • బోధన్ - సుదర్శన్ రెడ్డి
  • వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
  • ఇబ్రహీంప్నం - మల్ రెడ్డి రంగారెడ్డి
  • పరిగి - రామ్మోహన్ రెడ్డి
  • మల్కాజిగిరి - నందికంటి శ్రీధర్
  • మధిర - భట్టి విక్రమార్క
  • భద్రాచలం - పొదెం వీరయ్య
  • కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ 
  • మంథని - శ్రీధర్ బాబు
  • వేముల వాడు - ఆది శ్రీనివాస్
  • జగిత్యాల - జీవన్ రెడ్డి 
  • హుస్నాబాద్ - ప్రవీణ్ రెడ్డి
  • హుజూరాబాద్ - బల్మూరి వెంకట్
  • సిరిసిల్ల - మహేందర్ రెడ్డి
  • చొప్పదండి - మేడిపల్లి సత్యం
  • మానకొండూరు - కవ్వంపల్లి సత్య నారాయణ
  • రామగుండం - రాజ్ ఠాకూర్
  • పెద్దపల్లి - విజయ రమణారావు
  • ధర్మపురి - లక్ష్మణ్
  • కోరుటల్ - జువ్వాడి నర్సింగరావు
  • నాంపల్లి - ఫిరోజ్ ఖాన్ 
  • జూబ్లీహిల్స్ - విష్ణు వర్ధన్ రెడ్డి
  • ముషీరాబాద్ - అనిల్ కుమార్