తెలంగాణలో ప్రభుత్వం నుంచి వచ్చే మూడు లక్ష సాయం కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. వాళ్లు ఇళ్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు సాయం అందిస్తోంది. దీనికి గృహలక్ష్మీ అని పేరు పెట్టారు. 


గృహలక్ష్మీ ద్వారా మూడు లక్షలు వస్తే గూడు నిర్మించుకోవచ్చని చూస్తున్న లక్షల మంది పేద వాళ్లు పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున తొలి దశలో ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 


దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి గడువు లేకపోయినా ఆగస్టు 10వ తేదీతో ఆఖరు తేదీ అంటూ ప్రచారం జరుగుతోంది. అంటే ఇవాళే లాస్ట్ డేట్ అనుకొని ప్రజలంతా ఆఫీస్‌ల వద్ద క్యూ కట్టారు. అయితే దీనికి ఎలాంటి గడువు లేదని... ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల లబ్ధిదారులను పరిశీలిన స్టార్ట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 


వీళ్లు అనర్హులు
ఆర్‌సీసీ రూఫ్ ఉన్న వాళ్లు 
జీవో నెంబర్‌ 59 కింద లబ్ధిపొందిన వాళ్లు
ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్లు అర్హులు 


ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను 20వ తేదీలోపు పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం 25 నుంచి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నిధులను మూడు విడతలుగా ఇవ్వబోతున్నారు.