No Confidence Motion: 



అవిశ్వాస తీర్మానంపై చర్చ 


పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై వాడివేడి చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పీచ్‌ సంచలనమైంది. ఆ తరవాత స్మృతి ఇరానీ, అమిత్ షా గట్టిగా బదులు చెప్పారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశంపై మాట్లాడనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించారు. ఆయనేమైనా భగవంతుడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది..? ఆయనేమైనా పరమాత్ముడా? భగవంతుడేమీ కాదుగా. మా డిమాండ్‌లను ఆయన ముందే వినిపిస్తాం"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు