ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- మంత్రి అమర్‌నాథ్‌


ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి  తెలుగువారిని కలిశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్  సహా పలు ఆస్పత్రులకు పంపినట్లు వివరించారు. ఏపీకి చెందిన వారు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 309 మంది ఉన్నారని, అలాగే యశ్వంత్ పురా లో 33 మంది ఉండగా.. మొత్తంగా 342 మంది తెలుగు ప్రజలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా చదవండి


భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్‌లెన్స్‌, హెచ్ఆర్డీ కేంద్రం


దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేని విధంగా.. బీఆర్ఎస్ పార్టీకి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మించనున్న భారీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. చండీహోమం, పుర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరే ఇతర రాజకీయ పార్టీలకు లేని విధంగా శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇంకా చదవండి


బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి భూకేటాయింపు రద్దు చేసిన హైకోర్టు!


బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారధి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ పౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసాథి రెడ్డి ఉన్నారు. అయితే 2018 సంవత్సరంలో హైదరాబాద్ లోని ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీఓను సవాల్‌ చేస్తూ... 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైట్ సొసైటీతో పాటు ఊర్మిళ, సురేష్ కుమార్... ఎంపీ పార్థ సారధికి భూమిని కేటాయించడంపై తమకు అభ్యంతరం ఉందంటూ పిల్ వేశారు. ఇంకా చదవండి


ఉపాధి హామీ కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - త్వరలోనే కూలీలకు పలుగు, పార పథకం


దేశవ్యాప్తంగా ఉన్న కూలీలకు ఏదో సాయం చేస్తామంటూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు పట్టించుకోవట్లేరని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మోదీ సర్కారు పెద్దగా పట్టించుకోవట్లేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తోందని అన్నారు. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. కూలీల శ్రేయస్సు కోరి, ఉపాధి హామీ కూలీలకు తట్ట, గడ్డపార, పార వంటి పనిముట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున ఉపాధి హామీ కూలీలకు.. స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, ఆయా వస్తువులను తీసుకెళ్లే విధంగా ఓ మంచి బ్యాగుని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంకా చదవండి


ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు


ప్రకాశం జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం వివాదం అధికార ప్రతిపక్షం మధ్య అగ్గి రాజేసింది. టీడీపీ, వైసీపీ నేతల పోటాపోటీ కార్యక్రమాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాయుడుపాలెంలో ఉప్పునిప్పులా మారింది పరిస్థితి. టీడీపీ కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతుల ఆరోపణలు చేశారు. దీనిపై మండిపడ్డ టీడీపీ నేతలు ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాట యుద్ధం నడిచింది. ఇంకా చదవండి