కేసీఆర్ సమకాలీకులే కానీ రాజకీయ భవిష్యత్‌కు గండం


తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నారు కేసీఆర్. కానీ ఒకప్పుడు కేసీఆర్ ఎక్కువ పవర్ ఫుల్ గా ఉన్న నేతలు.. ఆయన సమకాలీకుల రాజకీయ జీవితం రిస్క్ లో పడిపోయింది. అసలు కంటిన్యూషన్ ఉంటుందా లేదా అని వారి అనుచరులు మదనపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి ఈ జాబితా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా  విశ్లేషం ఏమిటంటే వీరిలో ఎక్కువ మంది కేసీఆర్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఆయన కరుణిస్తేనే కంటిన్యూషన్ లేదంటే ప్యాకప్ అన్నట్లుగా మారిపోయింది. ఇంకా చదవండి


6,500 పోస్టులకు రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన


తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఖాళీల్లో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆగస్టు 24 మంత్రి సబిత మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. 


ఏపీలో ఓటర్ల జాబితా గందరగోళానికి కారణం ఎవరు ? 


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల జాబితా అంశం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లను గుర్తించామని తీసేయాలని ఫామ్ 7లు  అప్లయ్ చేస్తున్నారు. అయితే  వైసీపీ కుట్ర పూరితంగా నిజమైన ఓటర్లను.. తమ పార్టీకి ఓటు వేయని వారిని వాలంటర్ల ద్వారా గుర్తించి.. తీసేస్తుందని ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమేనని మండి పడుతోంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ అంశంపై చేసిన పోరాటానికి ఈసీ చాలా ఆలస్యంగానైనా  స్పందించింది. పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఒక్క  ఉరవకొండ కాదని దేశం మొత్తం అదే పరిస్థితి ఉందని టీడీపీ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయింది. ఇంకా చదవండి


శభాష్ తెలుగోడా.. ! చంద్రయాన్ ప్రయోగంలో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ శాస్త్రవేత్తలు


చంద్రయాన్ 3 విజయంతో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలల్లో ఇండియా చరిత్ర సృష్టించిందని వేనోళ్లతో ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో ఎంతో మంది కృషి ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. దేశ ఘటతను ప్రపంచ వ్యాప్తం చేయడంలో తమ వంతు కృషి చేశారు. ఇంకా చదవండి


మంత్రి పదవి తీసుకుంటే మెత్తబడినట్లు కాదు - ఎన్నికల్లో పోటీపై మహేందర్ రెడ్డి మన్నారంటే ?


తాండూరు మాజీ ఎమ్మెల్యే , మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు షాకిచ్చే కామెంట్లు చేశారు. మంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినంత మాత్రాన తాను మెత్తబడినట్లు కాదని .. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై  పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని మీడియాతో వ్యాఖ్యనించారు. ఇంకా చదవండి