Telangana Seniors : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నారు కేసీఆర్. కానీ ఒకప్పుడు కేసీఆర్ ఎక్కువ పవర్ ఫుల్ గా ఉన్న నేతలు.. ఆయన సమకాలీకుల రాజకీయ జీవితం రిస్క్ లో పడిపోయింది. అసలు కంటిన్యూషన్ ఉంటుందా లేదా అని వారి అనుచరులు మదనపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి ఈ జాబితా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా విశ్లేషం ఏమిటంటే వీరిలో ఎక్కువ మంది కేసీఆర్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఆయన కరుణిస్తేనే కంటిన్యూషన్ లేదంటే ప్యాకప్ అన్నట్లుగా మారిపోయింది.
టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటే తుమ్మల పవర్ ఫుల్ - మరి ఇప్పుడు ?
ఖమ్మం జిల్లాలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ రాని కీలక బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఆయన అభిమానులు కింకర్తవ్యం అని చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ లో చేరాలని వారు తమ్మలపై ఒత్తిడ ితెస్తున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు .. కేసీఆర్ సమకాలీకులు. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ .. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వాల్లో తుమ్మల మంచి పవర్ ఫుల్ నేతగా ఉండేవారు ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఆయన మాటకు పలుకుబడి ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయనే కేసీఆర్ పంచనకు చేరారు. ఇప్పుడు కేసీఆర్ కూడా టిక్కెట్ కేటాయించకపోవడంతో తదుపరి ఎం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
మోత్కుపల్లి నర్సింపులదీ అదే పరిస్థితి !
ఇక టీడీపీ నుంచే కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి నర్సింహులదీ అదే పరిస్థితి రెబల్ లీడర్ గా పేరున్న ఆయన ఆలేరు నుంచి చాలా సార్లు గెలిచారు. ఓ సారి ఇండిపెండెంట్ గా గెలిచారు. కేసీఆర్ పై మ౧దట్లో తీవ్ర వ్యతిరేకత చూపారు. టీడీపీలో చాలా కాలం ఉన్నా.. ఇక బయటకు రాక తప్పదనుకున్నప్పుడు .. టీడీపీపై, చంద్రబాబుపై చాలా విమర్శలు చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కానీ ఇమడలేకపోయారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో కేసీఆర్ ఆహ్వనిస్తే బీఆర్ఎస్ లో చేరారు.కానీ ఆ తర్వాత ఆయనను పట్టించుకున్న వారు లేరు. కేసీఆర్ ను ఎంత పొగిడినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడాయ రాజకీయ భవిష్యత్ కు గ్యారంటీ లేదు. కేసీఆర్ కరుణిస్తేనే చాన్స్ ఉంటుంది.
బీఆర్ఎస్‌లో చేరి ఎక్కడా కనిపించని మండవ వెంకటేశ్వరరావు
ఇక కేసీఆర్ సమకాలీకుల్లో మరొకరు మండవ వెంకటేశ్వరరావు.. డిచ్ పల్లి సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున వరుసగా గెలిచిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. కానీ కేసీఆర్ ఆయనకు ఓ పదవి ఇద్దామని కానీ.. లేదా పార్టీ పని చెబుదామని కానీ ఎప్పుడూ అనుకోలేదు. దాంతో ఆయన రాజకీయ జీవితం కూడా డైలమాలోనే ఉంది. కేసీఆర్ తల్చుకుంటే ఆయనకు ఓ పదవి వస్తుంది.
ఇతర సీనియర్లకూ గడ్డు పరిస్థితే !
ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రెండు సార్లు వ్యవహరించి.. ఉమ్మడి రాష్ట్రంలో పవర్ ఫుల్ అనిపించుకున్న డీఎస్ ఇప్పుడు ఫేడవుట్ అయిపోయారు. అనారోగ్యంతో పాటు ఏ పార్టీలోనూ నిస్సహాయత స్థితిలో ఉన్నారు. ఇక తాటికొండ రాజయ్యకూ మంచి రోజులు అయిపోయినట్లేనని భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు చాలా మంది సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తాయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.