కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది - షర్మిల వ్యాఖ్యలు


 కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం కాబోతోందన్న ఊహాగానాల మధ్య వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియా గాంధీతో షర్మిల భేటీ అనంతరం వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం పై ప్రకటన విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రకటన ఏదీ చేయకుండానే షర్మిల సోనియాను కలిసి వెనుదిరిగారు. సోనియాతో బ్రేక్ ఫాస్ట్ భేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఇంకా చదవండి


ఆ నిర్మాతల అసలు బిజినెస్ డ్రగ్స్, వ్యభిచారమే - మాదాపూర్ కేసులో సంచలన విషయాలు


మాదాపూర్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు... కీలక విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ,ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినీమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని గుర్తించి రెయిడ్ చేశారు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు. ఇంకా చదవండి


బండిని తప్పించాక బీజేపీలో దూకుడు తగ్గిందా?


కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత...తెలంగాణలో బీజేపీ శ్రేణులు వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మాత్రం...సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేకపోతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు మీదుంటే... బీజేపీ మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకత్వం చేరికల కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంలో ప్రత్యేకంగా కమిటీ వేసినా...ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. మొదట్లో రెండు సమావేశాలు నిర్వహించిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...ఆ తర్వాత అతిగతీ లేకుండా పోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్...అది దక్కకపోవడంతో నిరాశలో మునిగిపోయారని టాక్ బలంగా వినిపిస్తోంది. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వాళ్లంతా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెవుళ్లు కొరుకుంటున్నారు. ఇంకా చదవండి


రైతులకు నిధుల జమ కార్యక్రమం రేపటికి వాయిదా


కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయడానికి ఏపీ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే గురువారం (ఆగస్టు 31) నాడు జరగాల్సి ఉన్న నిధుల విడుదల కార్యక్రమం రేపటికి(సెప్టెంబర్ 1) వాయిదా పడింది. 2023-24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అందించనున్నట్లు ముందు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇంకా చదవండి


పొన్నాల లక్ష్మయ్యకు టిక్కెట్ లేనట్లేనా?


 తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన పొన్నాల లక్ష్మయ్య రాజకీయ  భవిష్యత్ గందరగోళంగా మారింది. గత ఎన్నికల్లోనే ఆయన బీసీ నినాదం, మాజీ పీసీసీ చీఫ్ ని అని చెప్పి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తేనే టిక్కెట్ లభించింది. ఈ సారి ఆయనకు టిక్కెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతూండటంతో.. ఆయన మరోసారి బీసీ వాదంతో  ఒత్తిడి తెచ్చే  ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆర్. కృష్ణయ్య లాంటి వారిని ఇంటికి పిలిచి హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా చదవండి