Madhapur Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు... కీలక విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ,ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినీమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని గుర్తించి రెయిడ్ చేశారు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు.
ఫ్రెష్ లివింగ్ సర్వీస్ అపార్టుమెంట్‌లో అసలు కథలు
డ్రగ్స్ దందాలతో పాటు వెంకట్ ,బాలాజీ వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కు తాను బానిస అయిన వెంకట్... అదే వ్యాపారం కూడా చేస్తున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్లలో డ్రగ్ పార్టీలు నిర్వహిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్మెంట్ ని రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు పెడుతున్నారు. గతంలోనూ వెంకట్, బాలాజీ లపై వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నాయి. వ్యభిచారం నిర్వహిస్తుండగా గతంలో రెండుసార్లు ఇద్దరిని పట్టుకున్న పోలీసులు.. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వెంకట్, బాలాజీ డ్రగ్ కస్టమర్లు ఎవరు అనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరా తీస్తోంది. వెంకట్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సినీ పరిశ్రమ వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాు.
గోవా నుంచి డ్రగ్స్ - ఢిల్లీ నుంచి అమ్మాయిలు
గోవా నుండి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు వెంకట్ నిర్వయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు అరెస్టయిన వారిని మాధాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పజెప్పారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది. వారికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో టాలీవుడ్‌లో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావించారు.
మొత్తం ఖాతాదారుల జాబితా బయటకు తీస్తున్న పోలీసులు
కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేయడం సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. పోలీసులు దాడి చేసినప్పుడు వెంకట్ ఫ్లాట్లో ఇద్దరు యువతులు ఉన్నారు. వీరిద్దరూ ఢిల్లీకి చెందిన వారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని యువతులను హైదరాబాద్ రప్పించారని పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల నుంచి వెంకట్ ప్లాట్ లోనే ఉండిపోయిన యువతులను పోలీసులు కాపాడారు.