YSR Rythu Bharosa: కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయడానికి ఏపీ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే గురువారం (ఆగస్టు 31) నాడు జరగాల్సి ఉన్న నిధుల విడుదల కార్యక్రమం రేపటికి(సెప్టెంబర్ 1) వాయిదా పడింది. 2023-24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అందించనున్నట్లు ముందు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. 


ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా..


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్, 2019 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.. అర్హులైన భూ యజమాని కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి, వారికి మొదటి విడత రూ. 7500/-  మే నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి), రెండో విడత రూ. 4000/- అక్టోబర్  నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి),
మూడో విడత రూ. 2000/- ప్రత్యేకంగా పీఎం కిసాన్ లబ్ధిని జనవరి నెలలో అందజేయడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో భూమి లేని షెడ్యూల్ తెగలు , షెడ్యూల్ కులం,  వెనకబడిన కులాలు,  మైనారిటీ వర్గాలకు  చెందిన కౌలు రైతు కుటుంబాలకు, దేవాదాయ భూములు అటవీ భూమి సాగుదారులకు  సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున ఆర్థిక సహాయం 3 విడతలలో రైతుల ఖాతాలలోకి  రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మొదటి విడత రూ. 7500/- లబ్ధిని మే నెలలో, రెండో విడత రూ. 4000/- లబ్ధిని అక్టోబర్ నెలలో, మూడో విడత రూ. 2000 లబ్ధిని జనవరి నెలలో అందజేస్తున్నారు.


2022-23 సంవత్సరంలో


మొత్తం లబ్ధిదారులు : 51,40,943
భూ యజమాని కుటుంబాలు : 49,26,041
భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 1,23,871
అటవీ భూమి సాగుదారులు : 91,031
లబ్ధి మొత్తం : రూ.6944.50 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి  : రూ.4015.94 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2928.56 కోట్లు)


Also Read: Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్


ఈ ఏడాది 2023-24  సంవత్సరం మొదటి విడత లబ్ధి జూన్ 1న భూ యజమానులు, అటవీ భూమి సాగుదారులకు రూ.3833.21 కోట్లు విడుదల చేయడం జరిగింది. కౌలు దారులకు మొదటి విడత లబ్ధి ఆగస్టు 31న విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రూ.109.74 కోట్లు 14,6324 భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు (3631 దేవాదాయ భూమి సాగుదారులతో కలిపి)  అందించడం జరుగుతుందని,
దీనితో  2023-24 వ సంవత్సరంలో మొదటి విడత లబ్ధి  మొత్తం 52,57,263 రైతులకు రూ. 3942. 95 కోట్లు అందుతుంది.
మొత్తం లబ్ధిదారులు : 51,10,939
భూ యజమాని కుటుంబాలు  : 50,19,187
అటవీ భూమి సాగుదారులు : 91,752
లబ్ధి మొత్తం : రూ.3833.21 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.2829.37 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.1003.84 కోట్లు)గా లెక్కలు చెబుతున్నాయి. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.31005.04 కోట్ల లబ్ధి రైతు కుటుంబాలకు అందించడం జరిగినదని ప్రభుత్వం ప్రకటించింది.