School Dropouts :  ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు మధ్యలోనే మానేస్తున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూనే ఉంది. తగ్గడం లేదు. ప్రభుత్వ విద్యను మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ... విద్యార్థుల డ్రాపౌట్స్‌ను మాత్రం తగ్గించలేకపోతున్నారు. తాజాగా పార్లమెంట్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్న ప్రతి వంద మంది విద్యార్థుల్లో 16.7 శాతం మానేస్తున్నారు.  ఇది 2020-21 విద్యా సంవత్సరం లెక్క. 2019-20లో ఈ డ్రాపౌట్స్ శాతం 14.8 శాతం మాత్రమే ఉండేది. ఈ ఏడాది అనూహ్యంగా పెరిగింది. ఏపీ ప్రభుత్వం నాడు - నేడు పేరుతో స్కూళ్లను కార్పొరేట్ స్కూల్స్‌గా మార్చామని చెబుతున్నప్పటికీ డ్రాపౌట్స్ సంఖ్య ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరిగింది .


అప్పటి నుంచి ఒక్క కశ్మీరీ పండిట్‌ కూడా వలసపోలేదు, లోక్‌సభలో కేంద్రం వివరణ


ఏపీ ప్రభుత్వం నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తోంది. ఈ కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు మధ్యలోనే స్కూల్స్ మానేస్తున్నారన్న విమర్శలు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. అయితే తెలంగాణలోనూ ఈ డ్రాపౌట్స్ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. తెలంగాణలో 2019-20 విద్యా సంవత్సంలో మొత్తం డ్రాపౌట్స్ శాతం 12.3 శాతం.అయితే 2020-21 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య పెరిగింది. 13.9 శాతానికి చేరింది. అంటే ఒకటిన్నర శాతానికిపైగా పెరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివేవారు అంతా పేదలే. ఈ కారణగా ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే తల్లిదండ్రులు వారితో స్కూల్స్ మానిపిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రబుత్వాలు వివిద రకాల పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే అవి కూడా డ్రాపౌట్స్‌ను తగ్గించలేకపోతున్నాయి. 


యూపీ మంత్రి రాజీనామా-దళితుడిననే పక్కన పెడుతున్నారంటూ ఆరోపణలు


గుజరాత్‌లో గత రెండు విద్యా సంవత్సరాల్లో డ్రాపౌట్స్ 23.7శాతంగా ఉన్నాయి. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇంత స్థాయిలో డ్రాపౌట్స్ ఉన్నాయని ఊహించడంకష్టమే. కానీ గుజరాత్లో పెద్ విద్యార్థులు కూడా చదువును అర్థాంతరంగా ఆపేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు వారికి విద్యాబుద్దులు నేర్పేందుకు పెద్దగా పథకాలు ప్రవేశ పెట్టడం లేదు. అస్సాంలో అత్యధికంగా 30 శాతానికిపైగా విద్యార్థులు మధ్యలోనే బడి మానేశారు. 


అయితే... పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో2020 - 21 విద్యా సంవత్సరంలో డ్రాపౌట్స్ శాతం 6.1 మాత్రమే. కానీ అంతకు ముందు ఏడాది ఈ పర్సంటేజీ 13.8 శాతం ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం.. మధ్యలోనే బడి మానేసేవారి సంఖ్యను పకడ్బందీగా నియంత్రించిందని అనుకోవచ్చు.