Telugu News Today: మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరినే - అధికారికంగా ప్రకటించిన జనసేన
మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు. బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. జనసేన నుంచి ఆయనే పోటీ చేస్తారని పార్టీలో చేరినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీల అమలు - సోమవారం అభ్యర్థుల ప్రకటన !
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. 9 గ్యారెంటీ ల కరపత్రం,డోర్ స్టిక్కర్ ను ఈ సందర్బంగా షర్మిల ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని.. ఇందులో B ఫామ్ లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే వస్తాయని షర్మిల తెలిపారు. హైకమాండ్ తో చర్చించేందుకు ఆదివారం షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు - కారణం ఏంటంటే?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. ఆయనపై బంజారాహిల్స్ (Banjarahills) పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanthreddy) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ అసత్య ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆ కేసును బంజారాహిల్స్ పీఎస్ కు పంపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
తెలంగాణలో అధికారపార్టీ కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మంచి జరగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి - తుగ్గలిలో ప్రజలకు జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు అండగా ఉంటాలని వైసీపీ అధినేత జగన్ ప్రజల్ని కోరారు. మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. గతంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందన్నారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి