AP Telangana News: ఏపీ బీజేపీ కీలక సమావేశానికి ఆ నేతలు డుమ్మా - త్రివేణి సంగమం అంటూ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం, అభ్యర్థులపై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ ఆఫీస్ బేరర్స్ సమావేశానికి కొందు బీజేపీ నేతలు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల వ్యూహాలను రెడీ చేసుకునే సమావేశానికి ఆ నలుగురు నేతలు రాకపోవడంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల వేళ నిర్వహించే సమావేశానికి కొందుర నేతలు డుమ్మా కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ నలుగురు నేతలు కూడా పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జ్యుడీషియల్ రిమాండ్‌కు కవిత- బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవితను ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి ఇచ్చిందుకు ఇకపై కుదరదని చెప్పేసింది. ఆమెను ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో కవితను కాసేపట్లో తీహార్ జైల్‌కు తరలించనున్నారు. పిల్లలకు పరీక్షలు ఉన్నందున తనకు మధ్యంతరబెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎంత ఒత్తిడి చేసినా పార్టీ మారను - ఎర్రబెల్లి క్లారిటీ !
పార్టీ మారాలని ఎవరెంత ఒత్తిడి చేసినా మారేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తాను పోలీసులతో బెదిరించి ఇల్లు రాయించుకున్నానని శరణ్ చౌదరి అనే వ్యక్తి చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చే్‌శారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు - కుమార్తెకు మాడుగుల ఎమ్మెల్యే సీటు !
అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని తాజాగా ప్రకటించారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సిట్టింగ్ స్థానంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తండ్రిని ఫాలో అవుతున్న కుమారుడు- చిరంజీవి సెంటిమెంట్ పాటిస్తున్న జనసేన అభ్యర్థి
తిరుపతిలో ఎన్నికల ప్రచారం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రచారం ముందు దైవ దర్శనం చేసుకుని... కలిసి వచ్చే ప్రాంతం నుంచి ప్రచారం చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గత ఎన్నికల ముందు తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద పూజలు చేసి అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించారు. దానినే అనుకరిస్తూ తండ్రి బాటలో తనయుడు వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి