Telangana news: లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కవితను ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి ఇచ్చిందుకు ఇకపై కుదరదని చెప్పేసింది. ఆమెను ఏప్రిల్‌ 9 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో కవితను కాసేపట్లో తీహార్ జైల్‌కు తరలించనున్నారు. 


బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌


పిల్లలకు పరీక్షలు ఉన్నందున తనకు మధ్యంతరబెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పుు రిజర్వ్ చేసింది. తీర్పు విషయంపై ఏప్రిల్‌ 1 వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. 


నేను నిర్దోషిని 


అంతకు ముందు కోర్టుకు వెళ్తున్న టైంలో కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు. కచ్చితంగా క్లీన్ ఇమేజ్‌తో బయటకు వస్తానన్నారు. ఇంకా ఏమన్నరంటే..." కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీలో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీ 50 కోట్ల విరాళాలు ఇచ్చారు. " అంటు విమర్శలు చేశారు.