Errabelli Dayakar Rao announced that he will Not Leave BRS : పార్టీ మారాలని ఎవరెంత ఒత్తిడి చేసినా మారేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తాను పోలీసులతో బెదిరించి ఇల్లు రాయించుకున్నానని శరణ్ చౌదరి అనే వ్యక్తి చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చే్‌శారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేసినట్లు తెలిసిందని వెల్లడించారు. అతని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
విజయవాడకు చెందిన విజయ్ అనే ఎన్నారై దగ్గర శరణ్ చౌదరి రూ.5 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. విజయ్ ఎవరో తనకు పరిచయం లేదని వెల్లడించారు. ఎన్నారైలు విజయ్‌ని తన దగ్గరికి తీసుకొచ్చారని, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించాని తెలిపారు. శరణ్ చౌదరిపై అనేక చీటింగ్ కేసులు ఉన్నాయని, అతనితోపాటు ఆయన భార్య పాస్ పోర్ట్ కూడా పోలీసులు సీజ్ చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ విజయ్ పంపించిన వీడియోను మీడియాకు చూపించారు. తనకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ అన్నారు. రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టాలని శరణ్ చౌదరి కోరాడని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమను మోసం చేశాడని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రణిత్ రావు ఎవరో తనకు తెలియదని స్పష్టం చేసారు. మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడీ, కేసులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాని ఎస్పీ రిజర్వడు చేశారన్నారు. రేవంత్ రెడ్డిపై ఓటు నోటుకు కేసుకు తనకు నాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వివాదం డైవర్ట్ అవుతుందని.. ఓటుకు నోటు కేసు పై నేను స్పదించనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఎర్రబెల్లి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అపజయం లేని రాజకీయ జీవితం మసకబారుతోంది. తొలి సారి పాలకుర్తిలో ఓడిపోయారు. ఆయనపై 26 ఏళ్ల యశశ్విని రెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయనపై అనేక వివాదాలు వస్తున్నాయి. పాలకుర్తిలోనే ప్రత్యేకంగా వార్ రూమ్ పెట్టి రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాటు.. భూ దందాలపై ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఎర్రబెల్లి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.