30 Years Industry Balireddy Prudhviraj Sensational Comments on CM Jagan: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు మరింత ఆసక్తిని కనబరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కనిపిస్తున్న అందరి దృష్టి మాత్రం ఏపీ రాజాకీయాలపైనే ఉన్నాయి. ఈసారి ఎలాగైన వైఎస్సార్‌సీపీని అధికార పీఠం నుంచి దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తు ప్రకటించినప్పటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత వాడివేడిగా మారాయి. చివరికి వరకు సీఎం పీఠం ఎవరిదనేది కూడా చెప్పడం కష్టంగా మారింది.


జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ప్రచారంలో మరింత దూకుడు చూపిస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలోనూ ఏపీ రాజకీయాలు హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇండస్ట్రీలో అగ్ర నటీనటులు, ప్రముఖులంతా ఏ పార్టీకి సపోర్టుగా ఉంటారా? అనేది సినీ, రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఏపీ పొలిటిక్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి.


"వీడు దొంగ.. వాడు ఏదవ ఇవన్నీ ప్రజలు చెప్పాలంటే ఈ 2024 ఎన్నికలు ఫలితాల వరకు వేయిట్‌ చేయాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాజాకీయాల్లో, ఎన్నికల్లో ఎమైనా జరగోచ్చు" అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అంతేకాదు పరోక్షంగా ఆయన టీడీపీకి మద్దతు పలికారు. సీఎం జగన్‌  నాయకుడిగా పనికి రారని, ఈసారి ఆయన అధికారంలోకి రావడం కష్టమే అన్న రీతిలో ఆయన పరోక్ష కామెంట్స్‌ ఉన్నాయి. దీంతో పృథ్వీరాజ్ కామెంట్స్‌ సినీ, రాజకీయా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అంతేకాదు మధ్యలో ఆయన పైన స్వర్గంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఏం తలుస్తున్నారో అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. 


"ఏపీలోని పబ్లిక్‌, చాలామంది ఉన్నారు వారంత ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు.. వారంత మాట్లాడాలి. బాధ్యత గల నాయకులంతా కార్యకర్తలను పిలిచి అడగాలి.  కానీ, అలాంటిది ఏం ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. ప్రజలేం అమాయకులు కాదు.ఏ ఊరికి ఆ ఊరు.. ఏ జిల్లాకు ఆ జిల్లా కార్యకర్తలను పిలిపించాలి. మాట్లాడాలి. నా లాంటి కార్యకర్తకే అన్యాయం జరిగితే.. మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటీ? నాలా అన్యాయానికి గురైన వారు చాలామంది ఉన్నారు. ఇటీవల నేను మా సొంతూరు తాడేపల్లి గూడెంకు వెళ్లాను. ఒక కార్యకర్తగా వెళ్లిన నాకు మంత్రికి దక్కిన ఆహ్వానం దక్కింది. నేను ఉన్న మూడు రోజులు కూడా రోజుకు రెండు మూడు వందల మంది స్థానికులు నాతో వచ్చి మాట్లాడారు" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.


గతంలోనే 150 సీట్లే కానీ, ఈ సారి క్లీన్‌ స్వీప్‌తో గెలుస్తామంటూ అధికార పార్టీ చేసిన కామెంట్స్‌పై కూడా ఆయన స్పందించారు. అవన్ని తానను ఉత్తిత్త మాటాలని, ఎవరి కాన్ఫిడెన్స్‌ వారందని.. నేను కూడా పార్టీ ప్రకటించి సీఎం అవుతానంటూ అవుతానా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ కామెంట్స్‌ సంచలనంగా మారాయి. కాగా గతంలో ప్రథ్వీరాజ్‌ వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరి టీటీడీ భక్తి టీవీలో కీలక పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ కొంతకాలానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేసి వైస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం జనసేనలో చేరారు.