అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్‌లోనూ కేసులు - కాంగ్రెస్‌కు చిక్కులు ?
భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఉన్న వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి అమిత్ షా అలా చెప్పలేదు. సిద్దిపేట సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. వాటిని తీసేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. కానీ ఆ వీడియోను ట్విస్ట్ చేసి ఎడిట్ చేసి అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్లుగా మార్చారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చంద్రబాబు వస్తే ఉన్న పథకాలు పీకేస్తారు- అనకాపల్లి ప్రచారంలో జగన్ విమర్శలు
ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని మోసాలు చేయడానికైనా వెనుకాడరని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి... అవి కొనసాగలంటే మాత్రం వైసీపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేపటి నుంచి మలివిడత యువగళం యాత్ర, ఒంగోలు నుంచి ప్రారంభం
తెలుగుదేశం యువనేత జనరల్‌ సెక్రటరీ నారా లోకేశ్( Nara Lokesh) మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం(Kuppam) నుంచి విశాఖ(Vizag) వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేశ్... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఉస్మానియా యూనివర్శిటీకి నీటి కొరత- హాస్టల్స్ మూసివేస్తున్నట్టు వార్డెన్ ప్రకటన
హైదరాబాద్‌లో రోజురోజుకు నీటి కొరత తీవ్రం అవుతోంది. ఇప్పుడు దాని ప్రభావం ఉస్మానియా యూనివర్శిటీపై పడింది. నీటి కొరత కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్స్ మూసివేస్తున్నట్టు వార్డెన్ ప్రకటన జారీ చేశారు. మే ఒకటో తేదీ నుంచి హాస్టల్స్, మెస్ మూసివేస్తున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఉస్మానియా యూనివర్శిటీలో నీటి కొరత ఉందని ఆదివారం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోం - మంత్రి ధర్మాన కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ చట్టంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వచ్చింది తమ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి