Yuva Galam: తెలుగుదేశం యువనేత జనరల్‌ సెక్రటరీ నారా లోకేశ్( Nara Lokesh) మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం(Kuppam) నుంచి విశాఖ(Vizag) వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేశ్... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం(Yuvagalam) యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు...


తెలుగుదేశం శ్రేణులు ఎన్నికలకు సిద్ధమయ్యేలా వారిలో ఉత్తేజం నింపిన లోకేశ్ యువగళం(Yuvagalam) యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మరోసారి ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రజల మద్దతు కోసం ఆయన ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం(Telugudesam)అధినేత చంద్రబాబు(Chandrababu) విరామం లేకుండా కూటమి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా...లోకేశ్‌ కేవలం తన నియోజకవర్గం మంగళగిరి(Mangalairi)కే పరిమితమయ్యారు. అపార్ట్‌మెంట్‌ వాసులను కలిసి ఓట్లు అభ్యర్థించడంతోపాటు...నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. ఆయన భార్య బ్రాహ్మణీ(Nara Brahmani) సైతం మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.


అయితే గతంలో లోకేశ్ పాదయాత్ర చేయని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో తిరిగి ఆయా ప్రాంతాల్లో మరోసారి లోకేశ్(Lokesh) పర్యటించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి యువగళం యాత్రలో పాల్గొననున్నారు. రేపు(మంగళవారం) ఒంగోలు(Ongole) నుంచి యువగళం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా మే 6 వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏప్రిల్ 30 ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, మే 4 నంద్యాల, 5 వ తేదీ చిత్తూరు, 6 వ తేదీ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు.


పాదయాత్ర బదులు బహిరంగ సభలు
గతంలో లోకేశ్(Lokesh) పాదయాత్ర ద్వారా గ్రామాలను చుట్టివచ్చారు. కుప్పం నుంచి అట్టహాసంగా  ప్రారంభమైన ఆయన పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇచ్చాపురం వరకు సాగాల్సి ఉండగా...చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌, బెయిల్ వ్యవహారంతో దాదాపు 2 నెలలకుపైగా పాదయాత్రకు లోకేశ్ విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడైతే పాదయాత్ర నిలుపుదల చేశారో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించినా...సమయం తక్కువగా ఉండటంతో కుదించి విశాఖ(Vizag) వరకే పరిమితం చేశారు. ఆ తర్వాత శంఖారావం పేరిట బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 


సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో  శంఖారావం సభలకు ముగింపు పలికి...సొంత నియోజకవర్గంపై దృష్టిసారించారు. అప్పటి నుంచి తీరిక లేకుండా నియోజకవర్గ ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించిన లోకేశ్(Lokesh)...ఇప్పుడు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా నేతల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా వారం రోజుల పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. గతంలో పర్యటించిన ప్రాంతాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. లోకేశ్ యాత్రతో మరోసారి యువతనో జోష్‌రానుందని...అది తమ గెలుపునకు ఎంతో ఉపయోగపడనుందని తెలుగుదేశం(Telugudesam) అభ్యర్థులు భావిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో లోకేష్ ప్రత్యేకంగా  ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించి...వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ నిర్వహణ, నిరుద్యోగ యువతకు భృతి తదితర హామీలపై వారికి అవగాహన కల్పించనున్నారు.


చంద్రబాబు పర్యటనలు
మరోవైపు చంద్రబాబు(Chandrababu) విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచార సభల్లొ పాల్గొంటున్నారు. కూటమి నేతలు పవన్‌కల్యాణ్‌తో(Pavanakalyan) కలిసి ఉమ్మడి బహిరంగ సభలకు హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) పర్యటన ఖరారుకావడంతో ఆయనతో కలిసి NDA బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్నికలకు మరో 15 రోజులే సమయం ఉండటంతో నేతలంతా తీరికలేకుండా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.