AP Land Titling Act is not being implemented  : ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ చట్టంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వచ్చింది తమ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.  భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు.  ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందన్నారు. అలాంటి  బీజేపీతో టీడీపీ ఇప్పుడు  జట్టుకట్టి వక్రభాష్యాలు చెప్తున్నారని ఆరోపించారు.                         


దేశవ్యాప్తంగా ఆ దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే అమలు చేసే ఆలోచన చేస్తామని ప్రకటించారు.  న్యాయస్థానాల్లో దాఖలైన పి టిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే అమలు గురించి ఆలోచన చేస్తామన్నారు.  అంతవరకూ  చట్టాన్ని  అమలు చేయబోమని గతంలోనే స్పష్టంచేశామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని.. ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామని స్పష్టం చేశారు.  సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోందిని..  అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించామన్నారు.  దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయని స్పష్టం చేశారు. 


గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయని..  మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది, ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. ఇంత చేస్తుంటే.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారుని ఆరోపించారు.  రైతుల కోసం ఏ రోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెప్తుందన్నారు. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. లఅలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు.  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు.  చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్… మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా?31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? అని ధర్మాన ఆవేశంగా ప్రశ్నించారు. 


రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా.. మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా అని ధర్మాన ప్రశఅనించారు.  ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయి:నిజాలను వారే అందరికీ వివరిస్తారన్నారు.  ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు తీసుకునే భావజాలం టీడీపీదని.. భూములను నిరుపేదలకు పంచాలన్న భావజాలం జగన్ దన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ వేదికపైనైనా వచ్చి చర్చకు తాను  సిద్ధమని ధర్మాన చాలెం్ జేశారు. రైతులకు అనుకూల నిర్ణయలు తప్ప, ఒక్క వ్యతిరేక నిర్ణయాన్నీ తీసుకోలేదని స్పష్టం చేశారు.