Nalgonda News: నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్- కాంగ్రెస్‌లో చేరిన గుత్తా ఫ్యామిలీ

Gutha Amit Reddy: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఉదయం ఆయన్ని కలిపిన కాంగ్రెస్ నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Continues below advertisement

Gutha Sukhender Reddy's Son: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ వీడుతున్న నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటున్నారు. తాజాగా గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీప్‌దాస్ మున్షి నాయకత్వంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

Continues below advertisement

ఎప్పటి నుంచో నలుగుతున్న విషయానికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బీఆర్‌ఎస్‌లో ఉంటున్న గుత్తా ఫ్యామిలీ ఎట్టకేలకు కాంగ్రెస్‌ గూటికి చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ గుత్తా ఫ్యామిలీ కనీసం లోక్‌సభ ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. 

అప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నేరుగా అధినాయకత్వానికి చెప్పేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు కాంగ్రెస్ పార్టీలే చేరిపోయారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola