Amit Shah morphing video Case :  భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఉన్న వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి అమిత్ షా అలా చెప్పలేదు. సిద్దిపేట సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. వాటిని తీసేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. కానీ ఆ వీడియోను ట్విస్ట్ చేసి ఎడిట్ చేసి అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్లుగా మార్చారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 


హోంమంత్రి వీడియో మార్ఫింగ్ పై హోంశాఖ సీరియస్ 


నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్ఫింగ్ చేయడంతో  బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు మార్ఫింగ్ చేసి, వీడియోను వైరల్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.


అసలు వీడియో షేర్ చేసిన బీజేపీ       


అమిత్ షా మాట్లాడిన అసలు వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలంగాణలో ముస్లింలకు ఉన్న రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారని, వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారని  స్పష్టం చేసింది.  


ఈ ఎడిటెడ్ వీడియోపై ఏబీపీ దేశం కూడా ఫ్యాక్ట్ చెక్ చేసింది. అమిత్ షా వీడియో ఫేక్ అని నిర్దారించింది. ఏబీపీ  దేశం ఫ్యాక్ట్ చెక్ కథనాన్ని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చేయడం చూడవచ్చు. 


బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా! ఆ వీడియోలో నిజమెంత


ముందుగా ఢిల్లీలో కేసు నమోదు   


ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం రోజున కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. సదరు వీడియోలను షేర్‌ చేసిన వారిని అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు.ఎడిట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  తెలిపింది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్‌ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేసినట్లు తెలిపింది. 


కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలే చేశారా ? 


బహిరంగసభ హైదరాబాద్‌లో జరిగింది కావడంతో హైదరాబాద్ లోనే మార్ఫ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ హ్యాండిల్సే ముందుగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్ నేతల ప్రమేయం లేదా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రమేయం ఉంటుందని భావిస్తున్నారు. 


ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కాంగ్రెస్  నేతలు మరితం ఎక్కువగా రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడుతున్నారు.  ీ కారణంగా ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్న  ఫేక్  ప్రచారంగా బీజేపీ అనుమానిస్తోంది.