Fact Check: బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా! ఆ వీడియోలో నిజమెంత

Telangana News: 2024లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు.

Continues below advertisement

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. 2024లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారని, తాము రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పినట్లు సోషల్ మీడియాలో వీడియో(ఇక్కడ & ఇక్కడ) వైరల్ అవుతోంది. ఆ వీడియోకు సంబంధించి నిజానిజాలు ఇక్కడ తెలుసుకుందాం. 

Continues below advertisement


ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘2024లో మోదీ మరోసారి ప్రధాని అవుతారు, కేంద్రంలో అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని’ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల బహిరంగ సభలో చెప్పారని ప్రచారం జరుగుతోంది.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఎడిట్ చేసిన వీడియో.  23 ఏప్రిల్ 2023న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడారు.  ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని’  అన్నారు. కనుక వైరల్ అవుతున్న వీడియో పోస్టులో వాస్తవం లేదని ఫ్యాక్ట్‌లీ చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో నిర్ధారణ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మీరు కనుక గమనిస్తే ఈ వీడియో క్లిప్ ఎడిట్ చేసిన వీడియో అని అర్థమవుతోంది. పూర్తి వివరాల కోసం సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాం. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగం పూర్తి నిడివి గల వీడియోని 23 ఏప్రిల్ 2023న ఈటీవీ తెలంగాణ (ETV Telangana) తమ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ‘Vijay Sankalp Sabha in Chevella | Part of BJP Parliament Pravas Yojana | Amit Shah Attends || LIVE’ అనే టైటిల్ తో ప్రత్యక్ష ప్రసారం చేశారు.  23 ఏప్రిల్ 2023న వికారాబాద్ జిల్లా చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకు సంబంధించిన వీడియోను తాజాగా చేసిన కామెంట్లు అని వైరల్ చేస్తున్నారు. 

ఆ ఒరిజనల్ వీడియోలో 03:07:15 టైమ్ వద్ద మొదలై, 03:07:23 వద్ద అమిత్ షా కామెంట్ ఉంది. ఈ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ..  ‘కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని’ అన్నారు. అమిత్ షా స్పీచ్ వీడియో క్లిప్ చేసి ఎడిట్ చేసి.. బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం అని మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారని వీడియో క్లిప్ ఎడిట్ చేశారని నిర్ధారించవచ్చు. ఆరోజు అమిత్ షా న్యూస్, స్పీచ్‌కు సంబంధించిన మరిన్ని న్యూస్ రిపోర్ట్స్ ఇక్కడ & ఇక్కడ గమనించదచ్చు. అమిత్ షా అధికారిక యూట్యూబ్ ఛానల్ లో కూడా 23 ఏప్రిల్ 2023న లైవ్ టెలికాస్ట్ చేశారని అర్థమవుతోంది.

కేంద్రంలో తాము మరోసారి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగ విరుద్ధమైన ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. కానీ రాజ్యాంగపరమైన మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అనలేదని నిర్ధారణ అయింది. 

This story was originally published by Factly, as part of the Shakti Collective. This story has been edited by ABP Desam staff.

Continues below advertisement
Sponsored Links by Taboola