ISRO Live Updates: గతి తప్పిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్.. కారణం ఏంటంటే..

ABP Desam Last Updated: 12 Aug 2021 08:41 AM
ఈ ప్రయోగం మళ్లీ చేపడతాం: కేంద్ర మంత్రి

జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగం విఫలం కావడంపై తాను ఇస్రో ఛైర్మన్ శివన్‌తో మాట్లాడినట్లు స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని మళ్లీ నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు.





రాకెట్ గమనం సాగింది ఇలా..


జీఎస్ఎల్‌వీ ప్రయోగం మొత్తాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ వీడియోను ట్విటర్‌లో ఉంచారు. మొదటి, రెండో దశలు సాధారణంగా అనుకున్న ప్రకారమే సాగగా.. మూడో దశలో సమస్య తలెత్తింది. నింగిలోకి దూసుకెళ్లిన మూడు నిమిషాలకు కూడా రాకెట్ పనీతీరు సవ్యంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాకెట్ ముందు భాగంలో ఉండే మొనదేలిన భాగాలు వేరుకావడం కూడా బాగానే జరిగింది. క్రయోజెనిక్ దశలో రాకెట్ గమనం మారింది. దీంతో చర్చల అనంతరం ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.


ఈ శాటిలైల్ ఉపయోగాలు ఏంటంటే..

ఈ జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ఈఓఎస్-03 అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్ష (జియో సింక్రనస్ ఆర్బిట్)లో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ రక్షణ అవసరాలు, ప్రకృతి వైపరీత్యాలను ఈ శాటిలైట్ ముందే పసిగట్టగలదు. ఈ ప్రయోగం విజయవంతం అయి ఉంటే జీఐశాట్-1 ఉపగ్రహం రోజూ కొన్ని చిత్రాలను తీసి ఇస్రోకు పంపి ఉండేది. దీనివల్ల భవిష్యత్తులో జరిగే ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టవచ్చు. భూపరిశీలనకు సంబంధించిన శాటిలైట్లలో దీన్ని కీలకంగా భావించారు.

తొలిసారిగా 4 మీటర్ల వ్యాసంతో..

తాజా జీఎస్ఎల్‌వీ రాకెట్‌లో 4 మీటర్ల వ్యాసం కలిగిన మొనదేలిన ముందు భాగాన్ని మొదటిసారిగా అమర్చారు. ఇప్పటిదాకా ప్రయోగించిన జీఎస్ఎల్‌వీ రాకెట్లలో ఇది పద్నాలుగో రాకెట్ అని ఇస్రో తెలిపింది. ఈ జీఎస్ఎల్‌వీ రాకెట్ ఎత్తు 52 మీటర్లు.


 





14 జీఎస్‌ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో 8 సక్సెస్

జీఎస్‌ఎల్వీ మార్క్ 1 ప్రయోగాల్లో 29శాతం సక్సెస్ రేటు ఉండగా.. జీఎస్‌ఎల్వీ మార్క్ 2కు 86 శాతం సక్సెస్ రేటు ఉంది. ఇప్పటిదాకా ఇస్రో 14 జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టింది. వాటిలో 8 సక్రమంగా నిర్దేశించిన కక్షలోకి ఉపగ్రహాలను చేర్చి విజయవంతం అయ్యాయి. మిగతా నాలుగు ప్రయోగాల్లో రెండు పాక్షికమైన విఫలం చెందగా.. మరో రెండు పూర్తిగా ఫెయిలయ్యాయి.


 

మూడో దశలో గతి తప్పిన రాకెట్

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ మొదటి, రెండో దశలు విజయవంతం అయ్యాయి. ఈ మేరకు రాకెట్ గమనం సాధారణంగానే ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ తర్వాత మూడో దశలో (క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్) సాంకేతిక సమస్యవల్ల ఇగ్నిషన్ అనుకున్న ప్రకారం జరగలేదు. దీంతో రాకెట్ మరో మార్గంలో ప్రయాణించింది. దీనికి సంబంధించి ఇస్రో ట్వీట్ చేసింది.


 





Background

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం తెల్లవారు జామున జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎఫ్10 (జీఎస్ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం చేపట్టింది. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ రాకెట్ కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా.. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 పొగలు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఒకటి రెండు దశలు సాఫీగానే సాగగా.. మూడో దశలో రాకెట్ గమనం గతి తప్పినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.


 





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.