అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా - డుమ్మా కొట్టే వ్యూహమేనా ?
ఏపీలో టీడీపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, హత్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇరవై నాలుగో తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ ధర్నాలో పాల్గొంటారు. రాష్ట్రాల శాంతిభద్రతల అంశంపై ఢిల్లీలో ధర్నాచేయడం వెనుక జగన్ వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఇరవై  రెండో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం - వారికి రూ.లక్ష ఆర్థిక సాయం
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రజా భవన్‌లో శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సౌదీ అరేబియాలో మరో తెలుగు వ్యక్తి దీన స్థితి - స్పందించిన మంత్రి లోకేశ్, స్వస్థలానికి తీసుకొస్తామని భరోసా
ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఎంతోమంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడును సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకుంటున్నారు. తాజాగా, సరెల్ల వీరేంద్రకుమార్ అనే తెలుగు వ్యక్తి వీడియో ద్వారా తన దీన స్థితిని వివరించాడు. ఖతర్‌లో (Qatar) ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సౌదీ అరేబియా (Saudi Arebia) తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీని ముంచెత్తిన వాన- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి- లంక గ్రామాల్లో భయం భయం
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీర దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని చెబుతోంది.  ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలకు అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఇది పూరి సమీపంలో కళింగపట్నానికి సుమారు 200 కిలోమీటర్లకుపైగా దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మౌనంగా గంగుల కమలాకర్ - పార్టీ మారడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదా ?
మాజీ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత గంగుల కమలాకర్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు.  తన మార్క్ పాలిటిక్స్ తో హల్ చల్ చేసే ఆ సీనియర్ లీడర్  గప్‌చుప్‌గా ఉంటున్నారు. కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన పార్టీ మారే ఆలోచనలో కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాలు  కాంగ్రెస్ వైపు లాగుతున్నాయి. ఇలా గందరగోళంగా ఉండటంతో ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి