డంబెల్‌తో కొట్టబోయింది- చంపేస్తుందన్న భయంతో బతికాను- దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు
ఏ రంగంలో తాను ఎదిగినా అందులో దాన్ని లాక్కునే దువ్వాడ వాణికి తనపై మొదటి నుంచి ధ్వేషం ఉందని తీవ్ర విమర్శలు చెప్పుకున్నారు. తన భార్య అని ఎక్కడా చెప్పని దువ్వాడ శ్రీనివాస్ తన భార్యగా ఆమె చెప్పుకుంటోందని అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. తన భార్యగా చెప్పుకొనే వాణి అంటూ ఎదురుదాడి ప్రారంభించారు. పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎప్పుడూ అక్రమాలు చేయలేదని ప్రజల కోసమే పని చేశాను అన్నారు. ఓడినా గెలిచినా తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



వాణి భోజనం పెట్టలేదు - మాధురి అండగా నిలబడింది- విడాకులు తీసుకుంటా: దువ్వాడ శ్రీనివాస్
రాజకీయంగా తనను మొదటి నుంచి అడ్డుపడుతున్న వాణి తను ఐదు సార్లు ఓడిపోవడానికి కూడా కారణమయ్యారని ఆరోపించారు. నామినేషన్ వేసిన ప్రతి సారి బ్లాక్ మెయిల్ చేసి తనను చికాకు పరిచేవారని అన్నారు. అలాంటి పరిస్థితిలో వ్యూహాలు వేయడంలో వెనుకబడి ఓటమిపాలయ్యానని చెప్పారు. 2024 ఎన్నికల్లో అయితే తను ఓటమి కోసం భార్య వాణి, మామ రాఘవరావు కలిసి తిరిగారని అన్నారు. టీడీపీ నేతలతో ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం - 8 రైల్‌ లైన్‌ల ఏర్పాటుకు అంగీకారం
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా రైల్వే లైన్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. శుక్రవారం మోదీ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం పాతిక వేల కోట్ల అంAచనాలతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్, బిహార్‌లో కొత్త రైల్వే లైన్‌లు నిర్మించనున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే లాన్‌లలో ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఒక కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే పీఠముడి - రేవంత్ మాట నెగ్గుతుందా ?
 తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ పంచాయతీ తేలడం లేదు. ఏ ఒక్క పదవి ఎవరికి ఇవ్వాలన్నా ఎన్నోపంచాయతీలు తెర ముందుకు వస్తున్నాయి. ఈ కారణంగా ఎవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా పదవి కాలం పూర్తయినా.. ఇంకా ముఖ్యమంత్రి కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే కొనసాగుతున్నారు. ఆయన పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన పేర్లు ఆయన ఇచ్చి వచ్చారు. గత నెలలో ఫైనల్ అయ్యారని అనుకున్నారు. కానీ చివరికి ప్రకటన మాత్రం రాలేదు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆర్టీసీల్లో ఉచిత బస్ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటూ వస్తోంది. సూపర్ సిక్స్‌ పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటు చూసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కీలకమైన వాటిని లైవ్‌లో పెట్టింది. ఇప్పుడు మరికొన్నింటినీ లైవ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు స్పీడ్‌గా చేస్తోంది. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ప్రచారం చేసిన హామీల్లో చాలా ముఖ్యమైంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిగోఅమలు చేస్తాం అదిగో అమలు చేస్తాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి