Andhra Pradesh: ఆర్టీసీల్లో ఉచిత బస్ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన మంత్రి, గుర్తింపు కార్డులు రెడీ చేసువాల్సిందే!

Chandra Babu: సోమవారం ఆర్టీసీపై సమీక్ష నిర్వహించనున్న ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు అందిచే ఉచిత బస్ ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Continues below advertisement

Super 6 Schemes: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటూ వస్తోంది. సూపర్ సిక్స్‌ పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటు చూసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కీలకమైన వాటిని లైవ్‌లో పెట్టింది. ఇప్పుడు మరికొన్నింటినీ లైవ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు స్పీడ్‌గా చేస్తోంది. 

Continues below advertisement

ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ప్రచారం చేసిన హామీల్లో చాలా ముఖ్యమైంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిగోఅమలు చేస్తాం అదిగో అమలు చేస్తాం. ఇంకా పరిశోధన దశలో ఉందంటూ ఫీలర్స్ వదలడం తప్ప స్పష్టమైన హామీ ఇచ్చింది లేదు. అయితే శుక్రవారం మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 

సోమవారం సమీక్ష

మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉతిర ప్రయాణం స్కీమ్‌పై సోమవారం(ఆగస్టు 12) నాడు సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాంప్రసాద్. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఎప్పుడు అమలు చేస్తాం. విధివిధానాలు ఏంటనేది ఆ రోజు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆర్టీసీ సమీక్షలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కూడా చర్చ జరుగుతుందన్నారు. 

ఇప్పటికే కర్ణాట, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు అవుతుంది. అక్కడ ఎలా అమలు అవుతుంది. వచ్చే అడ్డంకులు ఏంటీ, ఎంత ఖర్చు అవుతుంది. సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది. ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా అని ఇప్పటికే అధికారులు పరిశోధన చేశారు. దీని ఆధారంగా ఓ రిపోర్ట్ రూపొందించారు. దీన్ని ప్రభుత్వానికి సమర్పించనున్నారు. దీన్ని పరిశీలించిన చంద్రబాబు అధికారులతో చర్చించి విధవిధానాలు ఖరారు చేయనున్నారు. 

ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి వస్తే బస్సులపై తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఆవిషయం తెలంగాణ, కర్ణాటకలో చూశాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు అవసరమైన బస్‌లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా 1400 కొత్త బస్‌లు కొనుగోలుచేసింది. వాటిని రోడ్లపైకి త్వరలోనే తీసుకురానుంది. ఇప్పటికే ఉన్న బస్‌లలో ఫిట్‌నెస్ లేని వాటిని పక్కన పెట్టేశారు. మహిళకు ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి వచ్చే వరకు వీలైనన్ని ఎక్కువ బస్‌లు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్నట్టే విధవిధానాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఆధారంగా స్థానికులకే  ఈ పథకం అందేలా డిజైన్ చేయనున్నారు. 

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని పూర్తిగా నాశనం చేశారని మంత్రి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. ఆసియాలోనే పెద్ద నెట్‌వర్క్‌గా ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పి పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. వైసీపీ పాలనలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయిదని బస్సులు పూర్తిగా పాడైపోయినట్టు చెప్పుకొచ్చారు. అన్నింటినీ సరిచేసి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాస్త సమయం పడుతుందని అందుకే ఉచిత బస్ ప్రయాణం అమలు ఆలస్యమవుతుందని వివరించారు. 

Also Read: చోరీ అయిన సెల్‌ఫోన్లను భారీగా పట్టేసిన పోలీసులు, ఇలా చేస్తే ఈజీగా ఫోన్ దొరుకుతుందట - పోలీసులు

Continues below advertisement
Sponsored Links by Taboola