Srikakulam: ఏ రంగంలో తాను ఎదిగినా అందులో దాన్ని లాక్కునే దువ్వాడ వాణికి తనపై మొదటి నుంచి ధ్వేషం ఉందని తీవ్ర విమర్శలు చెప్పుకున్నారు. తన భార్య అని ఎక్కడా చెప్పని దువ్వాడ శ్రీనివాస్ తన భార్యగా ఆమె చెప్పుకుంటోందని అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. తన భార్యగా చెప్పుకొనే వాణి అంటూ ఎదురుదాడి ప్రారంభించారు. 


పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎప్పుడూ అక్రమాలు చేయలేదని ప్రజల కోసమే పని చేశాను అన్నారు. ఓడినా గెలిచినా తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని వివరించారు. ఇన్ని చేసిన తాను కుటుంబాన్ని మాత్రం మిస్ అయ్యాను అన్నారు. వివాహవ్యవస్థలో భర్త ఎదుగులకు భార్య సహకరించాలని అన్నారు. కానీ తమ కుటుంబంలో అది పూర్తి విరుద్దంగా ఉందన్నారు. ఒంటిలో యాంటీబాడీస్‌ తిరగబడినట్టు ఇప్పుడు తన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. 


ఎన్నికల ముందు నుంచి మొదలైన తన కుటుంబ వివాదం ఇప్పుడు మరింత రచ్చకెక్కిందన్నారు. తానేమీ స్థితిమంతుడిని కానని... ప్రజలకు ఎంతోకొంత సాయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చాన్నారు. రాజకీయాలను కుటుంబాన్ని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదన్నారు. పెళ్లై 30 ఏళ్లు అయినా ఎప్పుడూ తక్కువగా చూడలేదని చెప్పారు. తాను ఎన్నో ఆర్థికంగా రాజకీయంగా ఒడిదుడుకుల ఎదుర్కొన్నానని ఏనాడు ఆ సెగ కుటుంబానికి తాకలేదన్నారు. భార్యతోపాటు ఇద్దరి కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచానన్నారు. వారికి వైద్యవిద్యను అందించాని వివరించారు. 


పెళ్లైన మొదటి నుంచే తనపై వాణి అసూయ ధ్వేషం పెంచుకున్నారని అన్నారు శ్రీనివాస్. రాజకీయాలనే కాదు, లాభాల్లో ఉన్న తన వ్యాపారాలను లాక్కునేందుకు కూడా ఆమె పేరు మీద రాయించేందుకు కూడా ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. నిత్యం తనను ఎన్నో రకాలుగా వేధించారని ఆరోపించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి కుమార్తెల మెదళ్లులో వాణి విషం నింపారని ఆరోపించారు శ్రీనివాస్. ఇప్పుడు వాళ్లే తనపై తిరుగుబాటు చేసేలా చేసి ఘనత వాణిదేనన్నారు. 


2019 ఎంపీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఫ్యామిలీని మరికొందరి ప్రోత్సహించి తన ఓటమికి వాణి కారణయ్యారని ఆరోపించారు దువ్వాడ. ఓ సందర్భంలో తనపై డంబెల్‌తో దాడికి యత్నించిందన్నారు. ఆ టైంలో తాను తప్పించుకోబోయే క్రమంలో కింద పడి కాలు విరిగిపోయిందన్నారు. ఆ ఎన్నికల్లో కాలికి కట్టుతోనే ప్రచారం చేశానన్నారు. 


టెక్కలి టికెట్ విషయంలో కూడా చాలా చర్చలు  జరిగాయన్నారు శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తామని జగన్‌ చెప్పడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని వాణి బెదిరించారని అన్నారు. అప్పుడు తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి టికెట్ కూడా ఇచ్చానని అన్నారు. అయితే ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీ గ్రాఫ్‌ పడిపోవడంతో అధినాయకత్వం మళ్లీ తనకే టికెట్ కేటాయించదన్నారు దువ్వాడ శ్రీనివాస్