తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చుట్టు పక్కల జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో ఇదే భారీ వర్షమని వాతావరణ శాఖ తెలిపింది.
విల్లివక్కమ్‌లో 162 మిమీ, నుంగమ్‌బక్కమ్‌లో 145 మిమీ ఫుజల్‌లో 111 మిమీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం కూడా చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలోని కొరటూరు, పెరంబూర్, అన్నాసాలై, టీనగర్, గిండి, అడయార్, పెరుంగుడి, ఓఎంఆర్‌తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చెన్నై నగరంలోని వందలాది కాలనీలు నీటిలో మునిగిపోయాయి. చెన్నై, చెంగల్‌పట్టు, తిరువళ్లూరులకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
భారీ వర్షాల కారణంగా ఇవాళ ఉదయం 11 గంటలకు పుఝల్ రిజర్వాయర్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ మేరకు తిరువళ్లూరు కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఐఎండీ హెచ్చరిక..
ఆదివారం నుంచి మరో ఐదు రోజుల పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో వైపు ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.
Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి