అఫ్గానిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్లు తమకు తిరుగులేదనుకున్నారు. దేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. అఫ్గాన్‌ సైన్యం కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. దీంతో ఇంకా పేట్రేగిన తాలిబన్లు పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తాలిబన్లకు పంజ్ షీర్ భయం పట్టుకుంది. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు.


Also Read: Kabul Evacuation: అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది.. వైరల్ అవుతోన్న చిన్నారి వీడియో


పంజ్ షీర్ సైన్యం ఆధీనంలో తాలిబన్ కమాండర్లు 


పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నించిన తాలిబన్లలో 300 మందిని స్థానిక సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించినట్లుగా 300 మంది తాలిబన్లు మృతి చెందారని, వందల మంది తాలిబన్లు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు పంజ్ షీర్ సైన్యం తెలిపింది. మరికొందరు తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు తాలిబన్ కమాండర్లు తమ ఆధీనంలో ఉన్నట్లు పంజ్ షీర్ సైన్యం చెబుతోంది. 


 






Also Read: Afghanistan Crisis News: తాలిబన్ల నెక్ట్స్ టార్గెట్ అదే.. పంజ్‌షిర్ వైపు వందలాదిగా తరలుతోన్న వైనం..


తాలిబన్లను ఢీకొట్టి...


తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్‌ ప్రజలు బలంగానే చెబుతున్నారు. పంజ్‌షీర్‌ లోయలోకి వెళ్లే అన్ని మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్లను ఢీకొట్టి ఎదురునిలిచిన పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గాన్‌ను విముక్తి చేసేది అహ్మద్‌ షా మసూద్‌‌ నాయకత్వంలోని పంజ్‌షీర్‌ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు.


ఐదు సింహాల దేశం 


అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందుకుష్​ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రాంతం పంజ్ షీర్. జనాభా లక్షన్నర వరకు ఉంటుంది. ఈ ప్రావిన్స్ తాలిబన్ల అరాచకానికి ఎదురొడ్డి నిలుస్తోంది. పంజ్ షీర్ సైన్యాన్ని ముందుండి నడిపిస్తుంది మిలటరీ కమాండర్​అహ్మద్​ షా మసూద్. ఆయన తనయుడు అహ్మద్​ మసూద్. పంజ్ షీర్ అంటే ఐదు సింహాలు అని అర్థం. నాలుగు గంటల్లో లొంగిపోవాలని తాలిబన్లు పంజ్ షీర్ ప్రజలకు అల్టిమేటం జారీ చేశారు. పంజ్​షీర్ ప్రజలు ఈ హెచ్చరికలు లెక్కచేయలేదు. తిరిగి యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. తాలిబన్లు దాడి చేయాలని చూస్తే వారికి భారీ నష్టం తప్పదని ముందుగానే హెచ్చరించారు.


Also Read: Afghanistan News: కాబుల్ నుంచి భారత్‌కు చేరిన మరో 146 మంది.. 8 రోజుల ఎదురుచూపులు.. ఓ బాధితుడు ఏమన్నాడంటే!