అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు ఆగట్లేదు. ఇప్పటికే అప్గానిస్తాన్ దేశాన్ని దాదాపుగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. కొన్ని ప్రాంతాలను మాత్రం వదిలేశారు. వాటిలో పంజ్‌షిర్ లోయ ఒకటి. గత రెండున్నర దశాబ్దాలుగా దీనిని ఆక్రమించుకునేందుకు తాలిబన్లు రకరకాల యత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ అధ్యక్షుడు, సైన్యం అంతా లొంగిపోయినా సరే పంజ్‌షిర్ ప్రాంతంలోని వారు మాత్రం తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇక్కడి వారితో కలిసి.. తాలిబన్లపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకునేందుకు వందలాది తాలిబన్లు బయల్దేరారు. ఇదే విషయానికి సంబంధించి పంజ్‌షిర్ ప్రావిన్స్ ట్విటర్ హ్యాండిల్ పలు అంశాలను ట్వీట్ చేసింది. తాలిబన్ల బెదిరింపులకు లొంగేది లేదని ట్వీట్లలో పేర్కొంది.
పంజ్‌షిర్ ప్రాంతంలోని పర్వతాలు, నదులు శాశ్వతంగా ఉంటాయని.. వీటిని ఎవరూ ఏం చేయలేరని స్పష్టం చేసింది.
అరబ్బులు తాలిబన్లకు మద్దతు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమేతరులను ద్వేషించేలా చేస్తుందనే అర్థంలో ట్వీట్ చేసింది.
Also Read: Kabul Evacuation: అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది.. వైరల్ అవుతోన్న చిన్నారి వీడియో