ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పోలింగ్ జరిగి కౌంటింగ్ పెండింగ్‌లో ఉన్న  పరిషత్ ఎన్నికలపై అనుకూల తీర్పు లభించింది. కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి ఎన్నికలను వారంలో నిర్వహించారన్న పిటిషన్‌పై సింగిల్ బెంచ్ ఎన్నికలు చెల్లవని తీర్పు చెప్పింది. అయితే ఎస్‌ఈసీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. విచారణ పూర్తి చేసి ఆగస్టు ఐదో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ రోజు తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో  కౌంటింగ్‌కు ఎస్‌ఈసీ తేదీలను ఖరారు చేయనుంది.
  
సుప్రీంకోర్టు తీర్పులో ఆ అంశమే ఇప్పుడు వివాదానికి కారణం...!


స్థానిక ఎన్నికలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పింది. అయితే నిమ్మగడ్డ తర్వాత ఎస్‌ఈసీగా వచ్చిన నీలం సహాని ఒక్క వారంలో ఎన్నికలు నిర్వహించేశారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ పెట్టనందుకు  ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహాని ఇచ్చిన నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఎస్ఈసీ .  పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది. తర్వాత పోలింగ్ యధావిధిగా నిర్వహించారు.  డివిజనల్ బెంచ్ సూచనల మేరకు మళ్లీ సింగిల్ జడ్జి దగ్గరకే ఆ పిటిషన్ వచ్చింది. సింగిల్ జడ్డి ధర్మాసనం తన పాత తీర్పునకే కట్టుబడ్డారు. ఎన్నికల నిర్వహణ చెల్లదని తీర్పు చెప్పారు. మళ్లీ నిబంధనల ప్రకారం  నాలుగు వారాల సమయం ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలు జరపాలని మే 21వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు.  తర్వాత ఎస్ఈసీ మళ్లీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. డివిజనల్  బెంచ్ విచారణ జరిపి ఇప్పుడు తీర్పు చెప్పింది.


  Also Read : మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీకి 8వ స్థానం.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
స్థానిక ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదమే ! 


కరోనా కారణంగా దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించడంతో మొదటి సారిగా స్థానిక సంస్థల ఎన్నికలు 2020 మార్చి పదిహేనో తేదీన అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అప్పటికి పంచాయతీ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేశాయి. అప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియపై చాలా విమర్శలు వచ్చాయి. ఎన్నికల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉందని.. దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ కూడా వివాదాస్పదం అయింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఎన్నికలను దురుద్దేశపూర్వకంగా వాయిదా వేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడా సానుకూల ఫలితం రాలేదు. అయితే కోర్టుల్లో కేసులు మాత్రం ఉన్నాయి.


Also Read : తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం


మధ్యలో రమేష్ కుమార్ తొలగింపు .. మళ్లీ నియామకం ! 
 
రమష్ కుమార్‌ మొదట ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు వారాలు ముగిసేలోపే నిమ్మగడ్డను.. ప్రభుత్వం తొలగించింది. అయితే తన తొలగింపు చెల్లదని ఆయన న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోలేదు.  చివరికి కనగరాజ్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమిస్తూ ఎట్టకేలకు ఏపీ సర్కార్ గవర్నర్ పేరిట ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ ఆయన విధుల్లోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై అడుగు ముందుకు పడింది.


Also Read : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదా..? ఏళ్ల తరబడి వివాదం ఎందుకు సాగుతోంది ?


జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ !


మళ్లీ ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. అయితే ఆయన హయాంలో ఎన్నికలు వద్దనుకున్న ప్రభుత్వం కోర్టుల్లో పలు పిటిషన్లు వేసింది.అయినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో జనవరి ఎనిమిదో తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. అయితే పరిషత్ ఎన్నికలపై మాత్రం కోర్టులో పిటిషన్లు ఉండటం ఆలస్యమైంది. కోర్టునుంచి పర్మిషన‌ వచ్చిన తర్వాత నిమ్మగడ్జ తన పదవి కాలం ముగిసేలోపు ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. మార్చి 31న ఆయన పదవీ విరమణ చేశారు.


Also Read : బస్సెక్కిన ఆర్టీసీ బాస్... సాధారణ ప్రయాణికుడిలా ట్రావెల్... విషయం తెలిసి అధికారులు షాక్


ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పరిషత్ నోటిఫికేషన్ ఇచ్చిన నీలం సహాని 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసి .. ప్రభుత్వంలో సలహాదారుగా చేరిన నీలం సహానికి సీఎం జగన్ ఎస్‌ఈసీ పదవి ఇచ్చారు. ఆమె పదవి చేపట్టిన తొలి రోజే  పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎక్కడ ఆగిందో ఎన్నికల ప్రక్రియ అక్కడ్నుంచే ప్రారంభించాలని ఎనిమిది రోజుల్లో రాష్ట్రం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు. అప్పటికి  హైకోర్టులో పరిషత్ ఎన్నికలు మొదటి నుంచి నిర్వహించాలన్న పిటిషన్ విచారణలో ఉంది.  మామూలుగా ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం మొత్తం ఒక్కసారే పెట్టరు. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా జరిగాయి. కానీ పరిషత్ ఎన్నికలు మాత్రం రాష్ట్రం మొత్తం ఒక్క సారే పెట్టేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. ఆ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆద్యంతం వివాదాస్పదంగా సాగిన పరిషత్ ఎన్నికల వివాదం చివరికి అదే రీతిలో ముగిసింది.


సుప్రీంకోర్టుకు వెళ్తే మరింత కాలం ఈ వివాదం !


ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా సుప్రీంకోర్టుకు వెల్తే అక్కడ మరికొంతకాలం వివాదం నడిచే అవకాశం ఉంది. ఎవరూ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే ఎస్‌ఈసీ కౌంటింగ్ తేదీలను ప్రకటించి కౌంటింగ్ జరిపితే.. స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయినట్లవుతుంది.  


Also Read : బీజేపీలో మోడీ, షా వేరే వాళ్లను ఎదగనీయడం లేదా ? బలహీనుల్నే ఎందుకు సీఎంలుగా చేస్తున్నారు ?