పిచ్చి పరాకష్టకు చేరడం అంటే ఏంటో అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్లని చూసినప్పుడు నిజమే కదా…దీన్నే పరాకాష్ట అంటారని అర్థమవుతుంది. ఎవరైనా రెడ్ సిగ్నల్ పడగానే ఏం చేస్తారు. ఇదేం పిచ్చి ప్రశ్న గ్రీన్ సిగ్నల్ పడేవరకూ ఆగి ఆ తర్వాత ముందుకు సాగుతాం అంటారేమో. నిజమే కానీ రెడ్ సిగ్నల్ పడగానే ఓ ఇండోర్ కి చెందిన శ్రేయాకల్రా ఓ యువతి ఏం చేసిందో తెలుసా..జీబ్రా క్రాసింగ్ లైన్ మీద నిల్చొని స్టెప్పులేసింది. డాన్స్ పూర్తయ్యే వరకూ ట్రాఫిక్ అంతా అలా ఆగిపోయింది. అదంతా వీడియో తీసి ఇన్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇలా పోస్ట్ చేసిందో లేదో ఓ రేంజ్ లో వైరల్ అయింది. తన ప్రయత్నం సక్సెస్ అయిందని మురిసిపోయింది. కానీ ఆ తర్వాతే వచ్చింది అసలు సమస్య.
శ్రేయా కల్రా కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2లక్షలపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అభిమానులు చేయమన్న డేర్ ఛాలెంజ్ రీల్స్‌ని చేస్తుంటుంది. అందులో భాగంగా చేసిందే జీబ్రా క్రాసింగ్ మీద డాన్స్. డాన్స్ వీడియో పోస్ట్ చేయడమే కాదు ‘‘రూల్స్ బ్రేక్ చేయకండి- రెడ్ సిగ్నల్ వద్ద మీరు ఆగిపోవాలి ఎందుకంటే నేను డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి. మాస్కులు ధరించండి’’ అంటూ పోస్టు పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె స్టెప్పులు చూసి ఎంజాయ్ చేస్తే..మరికొందరు ఇదేం పిచ్చని కామెంట్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు.
Also Read: తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు నిబంధనలు అతిక్రమించి మరీ చెలరేగిపోతున్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: బాలిక హత్యాచార కేసులో అతను దొరికేశాడు, త్వరలో నిందితుడు కూడా..! రంగంలోకి డీజీపీ
Also Read: తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల వర్షాలు.. ఏపీలో ఐదు రోజుల వరకు..