Rahul Gandhi Controversy: 'హిందు ధర్మం అంటే సిక్కులు, ముస్లింలను కొట్టడం కాదు..' రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందుత్వ, భాజపా, ఆర్ఎస్‌ఎస్ భావజాలంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Continues below advertisement

హిందుత్వ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భాజపా విద్వేషపూరిత సిద్ధాంతాలు తమ ప్రేమ, ఆప్యాయతలతో కూడిన సిద్ధాంతాలపై పైచేయి సాధించాయని రాహుల్ అన్నారు. కాంగ్రెస్​ చేపట్టిన 'జన్​ జాగరణ్​ అభియాన్​'డిజిటల్​ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రాహుల్ గాంధీ ప్రారంభించారు​. భాజపా, కాంగ్రెస్​ సిద్ధాంతాల మధ్య వైరుద్ధ్యాల గురించి మాట్లాడారు.

Continues below advertisement

ఆ రెండు వేరు..

ఈ రోజున ఆర్​ఎస్​ఎస్​, భాజపా విద్వేషపూరిత భావజాలం.. కాంగ్రెస్​కున్న ప్రేమించే గుణం, మనం చూపించే ఆప్యాయత, పార్టీ జాతీయవాద సిద్ధాంతాన్ని పూర్తిగా అధిగమించేసింది. మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మన సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. కానీ వారి సిద్ధాంతాలు పైచేయి సాధించాయి. మన సిద్ధాంతాలను, మనం ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాము. అందుకే ఇలా జరుగుతోంది.                                           - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

[quote author= రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత]హిందూ మతానికి, హిందుత్వానికి మధ్య భేదాలేం

హిందూ మతానికి, హిందుత్వానికి మధ్య భేదాలేంటి? ఆ రెండు ఒకటి కాదా? ఆ రెండు కచ్చితంగా ఒకటి కాదు. హిందూ మతం అంటే సిక్కును, ముస్లింలను కొట్టడమా? కానీ హిందుత్వం అంటే అదే.                                          - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
టి? ఆ రెండు ఒకటి కాదా? ఆ రెండు కచ్చితంగా ఒకటి కాదు. హిందూ మతం అంటే సిక్కును, ముస్లింలను కొట్టడమా? కానీ హిందుత్వం అంటే అదే.                                          [/quote]

భాజపా ఎదురుదాడి..

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఐటీ చీఫ్ అమిత్ మాళవీయ ఖండించారు.

సల్మాన్ ఖుర్షీద్, రషీద్ అల్వీలు హిందువులను, హిందుత్వాన్ని కించపరిచే స్వేచ్ఛా ఏజెంట్లని మీరు అనుకుంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ వారి అసహ్యకరమైన వాదనలను ప్రతిధ్వనించారు. హిందుత్వాన్ని జీవన విధానం అని సుప్రీం కోర్టు అభివర్ణించగా, రాహుల్ దానిని హింసాత్మకం అన్నారు. ఆయన హిందూ గ్రంధాలను ఇస్లామిక్ రచనలతో సమానం అనేలా మాట్లాడారు.                                               - అమిత్ మాళవీయ, భాజపా ఐటీ చీఫ్

వివాదాస్పద వ్యాఖ్యలు..

కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జై శ్రీరామ్ అనే వారంతా ఋషులు, సాధువులు కారని.. అందులో కొంతమంది రాక్షసులు కూడా ఉన్నారని అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదే రీతిలో మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా వ్యాఖ్యానించారు. ఆయన కొత్తగా రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య అనే పుస్తకంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి.

ఋషులు, సాధువులకు తెలిసిన సనాతన ధర్మం, సంప్రదాయ హిందూ మతం.. హిందూత్వం అనే బలమైన శక్తి కారణంగా పక్కకు పోయాయి. ఇటీవలి కాలంలో ISIS, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపుల మాదిరిగానే ఇది కూడా మారుతోంది.                   -         సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ సీనియర్ నేత

Also read: Wife of Dawood aide: 'హార్దిక్ పాండ్య, మునాఫ్ నన్ను రేప్ చేశారు.. నగ్నంగా డ్యాన్స్ చేయించి..ఆ తరువాత'

Also read: Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'

Also read: Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు

Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి

Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?

Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి             

Continues below advertisement
Sponsored Links by Taboola