పంజాబ్‌లో 24 గంటల్లో జరిగిన మరొక మూకదాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కపుర్తలాలోని నిజాంపుర్లో ఓ వ్యక్తి సిక్కుల జెండాను (నిషాన్ సాహిబ్) అగౌరవ పరిచి, పారిపోతుండగా దాడి చేసినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ దాడిలో గాయపడి ఆ వ్యక్తి మరణించాడు. స్థానికులు అతడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
24 గంటల్లో..
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన 24 గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది.
స్వర్ణ మందిరంలోకి శనివారం ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆ వ్యక్తి ఎవరు?
శనివారం ఉదయం 11 గంటలకు ఆలయంలోకి వచ్చిన ఆగంతుకుడు అకాల్ తఖ్త్ ఎదుట కొన్ని గంటలు నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుడు గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు. అతడి వద్ద ఫోన్, పర్స్, గుర్తింపు కార్డుల్లాంటివి ఏమీ లేవని వెల్లడించారు.
మరణించిన నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 295ఏ (ఉద్దేశపూర్వకంగా మతపర విశ్వాసాలను అవమానించడం, ఆగ్రహానికి గురిచేయడం) సహా 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.
Also Read: Covid-19 Vaccination: ఆదర్శంగా అండమాన్ నికోబార్ దీవులు.. సవాళ్లను దాటి 100% వ్యాక్సినేషన్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి