కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" శరవేగంగా విస్తరిస్తున్న కారణంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా పరిస్థితులపై రెండు గంటల పాటు ఉన్నతాధికారులతో సమీక్షించారు. పలు రాష్ట్రాల నుంచి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో  అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు.





Also Read : " ఒమిక్రాన్‌" వేరియంట్ ఆందోళన కలిగించేదేనన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆఫ్రికా వాసుల రాకపోకలపై అనేక దేశాల ఆంక్షలు !


కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా 'ప్రమాదంలో' ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాసని మోడీ సూచించారు. అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించేలా చూసి.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని ప్రజలకు మోడీ సూచించారు.  


Also Read : దక్షిణాఫ్రికా నుంచి కొత్త కరోనా వైరస్ ముప్పు.. దేశంలో హై అలర్ట్ !


దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తరిస్తున్నందున అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షడంతో పాటు దేశంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. 


Also Read: Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!


ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నందున ఇండియాలోనూ ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వారంటైన్ అమలు చేస్తున్నారు. ఈ ఒమిక్రాన్ రకం వైరస్ ఎంత ప్రమాదకరమైనదో ఇంకా స్పష్టత లేదు. 


Also Read: Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి