ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 28,509 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 248 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,432కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 253 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,55,856 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,158 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






Also Read: పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,446కి చేరింది. గడిచిన 24 గంటల్లో 253 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,432కు చేరింది. 


Also Read:  " ఒమిక్రాన్‌" వేరియంట్ ఆందోళన కలిగించేదేనన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆఫ్రికా వాసుల రాకపోకలపై అనేక దేశాల ఆంక్షలు !


తెలంగాణలో కొత్తగా 160 కరోనా కేసులు


తెలంగాణలో కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32,540 నమూనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 160 కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. కోవిడ్‌ వల్ల నిన్న ఒకరు చనిపోయారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు 3,988 మంది మృతి చెందారు. కరోనా నుంచి 148 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,545 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.


కరోనా కొత్త వేరియంట్ ఆందోళన


బయటపడిన రెండు, మూడు రోజుల్లోనే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా  బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహాదారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్‌ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది.  బి.1.1.529 రకం వైరస్‌లో అత్యధిక సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.  వైరస్‌ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని  చెబుతోంది. తేలిగ్గా తీసుకుంటే ముప్పేనని భావిస్తుంది. ఒమిక్రాన్ అంటూ నామకరణం చేసింది. 


Also Read: బుందేల్‌ఖండ్‌లో పట్టు సాధిస్తే నిలబడినట్లే .. యూపీలో ప్రియాంక గాంధీ ప్లాన్ !


ఆఫ్రికా ఖండం బోట్స్‌వానా దేశంలో బయటపడిన కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్‌ గా భావిస్తున్నారు. దీంతో ఆసియా, యూరప్‌ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ కూటమి నిర్ణయించింది. బ్రిటన్ కూడా దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది.  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి