బయటపడిన రెండు, మూడు రోజుల్లోనే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహాదారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 రకం వైరస్‌లో అత్యధిక సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని చెబుతోంది. తేలిగ్గా తీసుకుంటే ముప్పేనని భావిస్తుంది. ఒమిక్రాన్ అంటూ నామకరణం చేసింది.
Also Read : సమస్యల పరిష్కారానికి కమిటీ.. ఆందోళన విరమించి ఇంటికెళ్లాలని రైతులకు కేంద్రం పిలుపు !
ఆఫ్రికా ఖండం బోట్స్‌వానా దేశంలో బయటపడిన కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ గా భావిస్తున్నారు. దీంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి నిర్ణయించింది. బ్రిటన్ కూడా దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది.
Also Read : బుందేల్‌ఖండ్‌లో పట్టు సాధిస్తే నిలబడినట్లే .. యూపీలో ప్రియాంక గాంధీ ప్లాన్ !
దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని పలు దేశాలు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశాయి. ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !
కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. అయితే కొత్త వేరియంట్ విజృంభణతో పరిస్థితి మరోసారి సున్నితంగా మారుతోంది. ఇప్పటికే ఈ వైసర్ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వ్యాక్సిన్లు కూడా పని చేయవన్న ప్రచారం జరుగుతూండటంతో ప్రజల్లోనూ ఆందోళన పెరుగోతంది.
Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి