ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చిపెట్టే లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకున్న ప్రియాంకా గాంధీ ప్రత్యేక వ్యూహాంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్‌కు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో కొన్నాళ్ల వరకూ కాంగ్రెస్‌కు తిరుగులేకుండా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సారి ప్రియాంకా గాంధీ ఆ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. మోహబాలో రోడ్ షో ద్వారా రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలి కాలంలో యూపీలో కాంగ్రెస్ అంటే ప్రియాంక గాంధీనే కనిపిస్తున్నారు. " నేను అమ్మాయిని, నేనూ పోరాడతాను" అనే స్లోగన్‌తో  రాజకీయం ప్రారంభించారు.


Also Read : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !


యూపీలో కాంగ్రెస్​ పార్టీకి మళ్లీ జవసత్వాలు ఖల్పించేందుకు ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. 1989లో కాంగ్రెస్‌‌ అధికారాన్ని  కోల్పోయిన నాటి నుంచీ ఉత్తరప్రదేశ్‌లో కుంచించుకుపోతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‌ను అన్ని పార్టీలూ పంచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అందర్నీ .. తమ వైపు తీసుకు వచ్చేందుకు ప్రియాంకా ప్రయత్నిస్తున్నారు. కుల, మతాలకు భిన్నంగా ఈసారి మహిళా మంత్రం ప్రయోగిస్తున్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం పార్టీ టికెట్లు మహిళలకే  కేటాయించాలని నిర్ణయించారు. 2022లో జరగబోయే ఎన్నికలో 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌ తరఫు నుంచి 161 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలువబోతున్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ కేవలం 11 మంది మహిళా అభ్యర్థులను మాత్రమే పోటీలో ఉంచగా, అందులో ఇద్దరే గెలిచారు.  


Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
 
ఇప్పటి వరకు కులం, మతం ఆధిపత్యం చెలాయిస్తున్న యూపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ ప్రణాళికలతో ప్రియాంకాగాంధీ ముందుకు వచ్చారు.  2019లో లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక బాధ్యతలు తీసుకున్నప్పటికీ చివరి క్షణంలో రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఇప్పుడు మాత్రం ముందుగానే రంగంలోకి దిగారు. మహిళలకు నలభై శాతం టిక్కెట్లు.. ఉచితంగా స్మార్ట్‌‌ఫోన్లు, ఈ-స్కూటర్లు  వ్యవసాయ రుణాలు పూర్తిగా రద్దు చేయడం, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు , రైతులకు మద్దతు ధరలు ఇలా ఎనిమిది అంశాలను మాత్రమే తీసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.  


Also Read: Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ


బుందేల్ ఖండ్ వంటి ప్రాంతాలపై బీజేపీ కూడాప్రధానంగా దృష్టి పెట్టింది. ఇటీవలే ప్రధాని మోడీ అక్కడ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ ప్రియాంకా గాంధీ ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. రెండేళ్ల నుంచి ఉత్తరప్రదేశ్​ అంతటా చేసిన పర్యటనల ఆధారంగా తన రాజకీయం చేస్తున్న ప్రియాంక మంచి ఫలితాలు సాధిస్తే కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. 


Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి