భారదేశంలో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా గుర్తించడంతో  కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోట్స్‌వానాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాల్‌ విసిరే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్‌ జరిపి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు.




Also Read : మోదీని గద్దె దించేందుకు దీదీ మాస్టర్ ప్లాన్.. మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్!


"విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిల్స్‌ని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించాలి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలి. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్‌ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది." అని కేంద్రం స్పష్టం చేసింది. 


Also Read: Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!


దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌  బయటపడింది. దీన్ని  బి.1.1.529గా గుర్తించారు. ఈ రకం కరోనా కేసులు ఇప్పటి వరకు 22 బయటపడ్డాయి. ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ వెలుగు చూసింది. ఈ వేరియంట్‌కు  అత్యధిక మ్యుటేషన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి కోణాల్లో ఈ రకం చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.  


Also Read: Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం


కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాల్‌ విసిరే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర్డ్ వేవ్ భయంలో ఇప్పటికే ప్రజలు ఉన్నారు. అప్రమత్తం కాకపోతే .. మరోసారి మూడో వేవ్ ఈ రకంతోనే వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి